Menu bar





Sunday, January 19, 2014

ఆంధ్రుల చరిత్రము : పోరు - నష్టము; పొందు - లాభము


ఆంధ్రుల చరిత్రము : పోరు - నష్టము; పొందు - లాభము(వికీపీడియా నుండి)

  చిలుకూరి వీరభద్రరావు గారు ఆంధ్రుల చరిత్రము ను ఐదు భాగాలుగా ప్రచురించాడు. మొదటి, రెండవ భాగాలను విజ్ఞానచంద్రికా మండలి 1910, 1912 లో ప్రచురించగా మూడవభాగం 1916లో ఇతిహాస తరంగిణీ గ్రంధమాల ద్వారా ప్రచురించబడింది. ఈ పుస్తకాలలో ఆంధ్ర క్షత్రియులు పాలించిన సామ్రాజ్యాలు, వారి అనంతరం వచ్చిన రెడ్డి రాజులు, కమ్మ, నిజాము నవాబులు గురించి, బ్రిటిషు వారి గురించి విపులంగా ఇవ్వబడింది.

ప్రథమ భాగము:
ఈ భాగము 1910 లో విజ్ఞాన చంద్రికా మండలి ద్వారా ప్రచురించబడింది. ఈ భాగములో కల వివరములు.

"ఆంధ్రులయొక్క రెండువేలయేనూరుసంవత్సరముల చరిత్రమును సవిస్తరముగా వ్రాయ నుద్యమించినవాడను గావున నంతయు నేక సంపుటమున నిమిడ్చిన నంతమనోహరముగా నుండదనియు, ప్రథమగ్రంథమగుటం జేసి యట్లుచేయుట సులభసాధ్యముగాదనియు భావించి చరిత్రకాలమునంతయు బూర్వయుగము, మధ్యయుగము, నవీనయుగము నని మూడుభాగములుగా విభాగించి యైతరేయ బ్రాహ్మణము మొదలుకొని క్రీస్తుశకము 1200 సంవత్సరమువరకును బూర్వయుగముగా గ్రహించి యాపూర్వయుగచారిత్రమునే ప్రథమభాగముగా నేర్పరచుకొంటిని. ఇందు ప్రాచీనాంధ్రదేశస్థితియు, ఆంధ్రవంశము, పల్లవవంశము, చాళుక్యవంశము, చాళుక్యచోడవంశము, కళింగగాంగవంశము, ఆంధ్రచోడవంశము, బాణవంశము, వైదుంబవంశము, హైహయవంశము, బేటవిజయాదిత్యవంశము, కళింగగాంగవంశము, విష్ణుకుండిన వంశము మొదలగునవి సంగ్రహముగా నిందుజేర్పబడినవి."

ద్వితీయ భాగము

ఈ భాగము 1912 లో విజ్ఞాన చంద్రికా మండలి ద్వారా ప్రచురించబడింది. ఇది మధ్యయుగమునకు సంబంధించిన చరిత్ర. క్రీ.శ1100 నుండి 1350 వరకు ప్రధానంగా కాకతీయ సామ్రాజ్య పతనము వరకు వ్రాయబడినది.

మూడవ భాగము

ఈ భాగము 1916 లో ఇతిహాస తరంగిణీ గ్రంధమాల ద్వారా ప్రచురించబడింది. ఈ భాగములోని విషయం గురించి రచయిత మాటల్లో >> "ఈ మూడవభాగములో క్రీ.శ 1323 మొదలుకొని క్రీ.శ. 1500 వఱకు గల చరిత్రము సంగ్రహముగా జెప్పబడినది. కాకతీయసామ్రాజ్యము భగ్నమైన వెనుక భిన్నరాజ్యములేర్పడి వేఱ్వేఱు రాజవంశములచే బరిపాలింపబడుటచేత పద్మనాయకుల చరిత్రము వేఱుగను, రెడ్ల చరిత్రము వేఱుగను జెప్పవలసి వచ్చినది. పద్మనాయకుల చరిత్రమువలన నోరుగల్లు చరిత్రమును గూర్చి ఫెరిస్తా మొదలగు మహమ్మదీయ చరిత్రకారులును , వారినిబట్టి స్యూయలు మొదలగు వారును వ్రాసిన చరిత్రములు సరియైనవి కావని తేటపడగలదు. ఈ మూడవ భాగమును జదువునపుడు రాచవారును, పద్మనాయకులును, రెడ్లును పరస్పర ద్వేషముల మూలమున సామ్రాజ్యములను బోగొట్టుకొని పారతంత్ర్యమునకు వశులైరనియును, కర్ణాటాంధ్రుల యైకమత్యము వలన కర్ణాట సామ్రాజ్యమని వ్యవహరింపబడిన విజయనగర సామ్రాజ్యము వర్ధిల్లినదనియు జదువరులుకు బోధపడగలదు. పోరునష్టము పొందు లాభమను విషయమునే యీ మూడవభాగము వేనోళ్లజాటుచున్నది."

Tuesday, November 12, 2013

పార్లమెంటు సుప్రీం అంటారు. దానికి తిరుగే లేదంటారు. ఇది నిజమా?


పార్లమెంటు సుప్రీం అంటారు. దానికి తిరుగే లేదంటారు. ఇది నిజమా?

పార్లమెంటు భారత రాజ్యాంగం ఆధారంగా ఏర్పడింది. రాజ్యాంగానికి అది పూర్తిగా నిబద్ధతతో ఉండాలి. అదే ప్రమాణం చేసే ఎవరైనా పార్లమెంటులో అడుగుపెట్టాలి.

పార్లమెంటు రాజ్యాంగానికి అనుగుణంగా నడచుకుంటోందా లేదా అన్నది తేల్చవలసింది సుప్రీం కోర్టు! అంతిమంగా , పార్లమెంటు, రాజ్యాంగం, సుప్రీం కోర్టు - వీటన్నిటినీ నడిపించేది ప్రజా ధర్మం.

పార్లమెంటులో 500 మంది సభ్యులూ ఏకమై పోయినా - భారత రాజ్యాంగాన్నిరూపుమాపలేరు. అప్పుడు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటుంది.
ఒకోసారి ... ప్రజాభిప్రాయం - ఆ మూడు వ్యవస్థలను కూడా ప్రభావితం చెయ్యవచ్చు. అంతిమంగా ప్రజల తీర్పే అన్నుల మిన్నగా నిలుస్తుంది. అట్లాంటి అపురూపమైన సన్నివేశాలు జాతి జేవనంలో అప్పుడప్పుడూ వస్తాయి. సమైక్య ఉద్యమం అట్లాంటిదే!

తెలుగు జాతిని చీల్చే అధికారం కేంద్రానికి గానీ, పార్టీలకు గానీ, చివరకు పార్లమెంటుకు కూడా లేదని జనం చెబుతున్నారు. మాకు ప్యాకేజీలు వద్దు; రాష్ట్ర సమైక్యమే ముద్దు అని నినదిస్తున్నారు.

అసెంబ్లీలో సాధారణ జనాభిప్రాయం ఏమిటో తీర్మానమైనప్పుడు, రాష్ట్రపతి - దానికి అనుకూలంగానే నిర్ణయం తీసుకోవాలి. సమైక్యమే కావాలని శాసన సభ తీర్మానిస్తే, అది జాతి సమగ్రతకు భంగం కాకపొతే, అట్లాంటి ప్రజాభిప్రాయాన్ని రాష్ట్రపతి మన్నించాల్సిందే! ఆర్టికల్ 3 లో రాసి ఉందిగదా అని , ప్రజల అభ్యంతరాలకు వ్యతిరేకంగా - రాష్ట్ర విభాజన చేయ్యలేరు!

పార్లమెంటు సభ్యులు కూడా గుడ్డిగా పార్టీ విప్ పాటించకూడదు! ఇట్లాంటి విషయాలలో పార్టీలకు వ్హిప్ అధికారమే ఉండకూడదు! బీజేపీ పార్లమెంటు సభ్యులకు రాష్ట్ర విచ్చిన్నాన్ని సమర్థించే నైతిక హక్కే లేదు. ఆ పార్టీలో పార్లమెంటులో మాట్లాడేందుకు ఈ రాష్ట్రానికి ప్రతినిధే లేడు! అట్లాంటి పార్టీ తగుదునమ్మా అని రాష్ట్ర విభజన నిర్ణయం ఎట్లా తీసుకుంటుంది?

విభజన బిల్లు పార్లమెంటు ముందుకు రాకపోవచ్చు; వచ్చినా అది వీగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. డ్రాఫ్టు బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడే - జనం దాన్ని తిప్పి కొట్టడం ఖాయం. ప్రజలు ప్యాకేజీలు కోరడం లేదు; రాష్ట్ర సమైక్యతనే కోరుతున్నారు. ఈ వాస్తవం గ్రహించి నేతలు మసలుకోవాలి!

ఓయి తెలుగువాడా!

ఓయి తెలుగువాడా
పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ
తకదింటి నడుమ గోడ
అన్నా కష్టలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి
అన్నా కష్టలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి
సత్యగ్రహణం చేసి ఒక తండ్రిని ధారపోసి
దాయాదుల వెన్ను వంచి
సొంత గడ్డ సమర్జించి
తెలుగు జాతి పరువు పెంచి
సమైక్యతని నిర్వచించి
ఇప్పుడు రాష్ట్ర పటం చించి చించి
ఏమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది
ఓయి తెలుగువాడా
పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ
తకదింటి నడుమ గోడ
ఓయి తెలుగువాడా
పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ
తకదింటి నడుమ గోడ
ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా
ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా
మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ
మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ
ఆంధ్ర సీమ తెలంగాణా ఒక్కొక్కటి ఊడ
ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ
పట్టిచ్చామనుకో ఇప్పుడు వేరు బాట చీడ
ఇంకేమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది
ఓయి తెలుగువాడా
పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ
తకదింటి నడుమ గోడ
ఓయి తెలుగువాడా
పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ
తకదింటి నడుమ గోడ
జాతి మహా యాత్ర ఇలా సాగే ఓ మాయిగాని
జాతి మహా యాత్ర ఇలా సాగే ఓ మాయిగాని
నడుమున మన అడుగులు తడబడిపోతే
నడకలలో వడిపోతే
మనకు మనకు చెడిపోతే
గొంతుల శ్రుతి విడిపోతే
కలయిక సందడిపోతే
ఒక స్నేహపు ముదిపోతే తడిపోతే
ఏమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది
ఓయి తెలుగువాడా
ఓయి తెలుగువాడా
పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ
తకదింటి నడుమ గోడ
ఓయి తెలుగువాడా
పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ
తకదింటి నడుమ గోడ
ఓయి తెలుగువాడా
ఓయి తెలుగువాడా
ఓయి తెలుగువాడా
తకదింటి నడుమ గోడ
తకదింటి నడుమ గోడ
తకదింటి నడుమ గోడ

 


తేది 12-11-2013 నాటి వార్త కధనాలు





తేది 12-11-2013 నాటి వార్త కధనాలు












Monday, November 11, 2013

శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ వైఖరి ఎలా ఉంటుంది?


               తెలంగాణా బిల్లును శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడితే భారతీయ జనతా పార్టీ వైఖరి ఎలా ఉంటుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణా ఏర్పాటు అంశాన్ని అందరి కన్నా ముందుగా తలకెత్తుకున్న భారతీయ జనతా పార్టీ ఆ తర్వాతి కాలంలో ఉద్యమాన్ని అంతగా ముందుకు తీసుకెళ్లలేకపోయింది. తెలంగాణా ఛాంపియన్‌గా అవతరించాలనుకున్న భారతీయ జనతా పార్టీ ఆశలు తీరలేదు. ఆ స్థానం నుంచి తెలంగాణా రాష్ట్ర సమితిని తప్పించేం దుకు బిజెపి చేసిన చాలా ప్రయత్నాలు ఫలించలేదు. ఒక దశలో రాజకీ య జెఏసి నుంచి కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు నెలకొ న్నాయి. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానంలో గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ చేసిన యత్నం ఆ ఎన్ని క వరకు ఫలించినా ఆ తర్వాత టిఆర్‌ ఎస్‌దే పైచేయిగా మారింది. ఇప్పటికీ టిఆర్‌ఎస్‌తో రాజకీయ వైరం గుంభనంగా కొనసాగుతూనే ఉంది.

                ఇరు పార్టీల మధ్య సఖ్యత కనిపించకపోగా శత్రుభావన నెలకొని ఉంది. అంతే కాకుండా తెలంగాణా ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత టిఆర్‌ఎస్‌ను ఆ పార్టీలో కలిపేసేందుకు మంతనాలు సాగుతుండటం కూడా బిజెపికి కంటగింపుగా మారింది. గత ఎన్నికలలో బిజెపి వైపు వెళ్లిన టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌తో అంటకాగుతుండటంతో భారతీయ జనతా పార్టీ తన వైరాన్ని కొనసాగిస్తున్నది. రాష్ట్రంలో ఇటు టిఆర్‌ఎస్‌, అటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు రెండు కూడా కాంగ్రెస్‌ పార్టీకే చేరువ అవుతుండటంతో ఇటు సమైక్య ఆంధ్ర ఉద్యమం వైపుగానీ అటు తెలంగాణా వైపు గానీ మొగ్గు చూపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఈ మేరకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సిద్ధాంత కర్తలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందువల్లనే ఇటీవల భారతీయ జనతా పార్టీ తన రూటును మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. ఆంధ్ర వారికి, రాయలసీమ వారికి న్యాయం చేయకుండా తెలంగాణా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు జాతీయ స్థాయిలో చెబుతున్నారు.

                 కాంగ్రెస్‌ పార్టీ కేవలం తన రాజకీయ అవసరాల కోసమే ఆంధ్రప్రదేశ్‌ విభజనను త పెట్టిందని భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో విపరీతమైన ప్రచారం చేసింది. ఈ నేపధ్యంలో లోక్‌సభ శీతాకాలం సమావేశాల్లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు బిల్లు సభ ముందుకు వస్తే భారతీయ జనతా పార్టీ వైఖరి ఎలా ఉంటుందనే అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతున్నది. లోక్‌సభలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు బిల్లు వస్తే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌కు సహకరించి బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకమేనని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా ఏర్పాటు అంశం తమ ఎజెండాగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అదే అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ తలకెత్తుకుంటే దానికి ఎంత వరకు మద్దతు ఇస్తుందనేది ప్రశ్నార్ధకమేనని కూడా అంటున్నారు. మరి ఈ నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణా ప్రజలకు దూరం కాకుండా ఉండే విధంగానూ తెలంగాణా రాకుండా ఉండే విధంగానూ కూడా తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

                మరి ఈ రెండు అంశాలు ఏకకాలంలో ఏ విధంగా సాధ్యం అవుతాయనే విషయమే ఆసక్తికరంగా మారింది. దీనిపై భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు భారీ కసరత్తు చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారతీయ జనతా పార్టీ వైఖరి మారలేదని బిజెపి సీనియర్‌ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయకుడు స్పష్టంగా చెప్పినా కూడా పార్టీ అనుసరిస్తున్న విధానం మాత్రం మారినట్లుగానే కనిపిస్తున్నది. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలోని వారికి న్యాయం చేయకుండా తెలంగాణా ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితం ఉండదనే వాదనను భారతీయ జనతా పార్టీ గట్టిగా చెబుతున్నది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ఆంధ్ర ప్రాతం నాయకులు ఢిల్లీ స్థాయిలో తమ వాణిని వినిపించగా దానిపై బిజెపి అగ్ర నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించింది. అయితే అదే సమయంలో తెలంగాణా అంశం నుంచి కూడా దూరంగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

               తెలంగాణా బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన తర్వాత దానిపై రాష్ట్ర అసెంబ్లీ ఏ విధంగా స్పందించినా కూడా దాన్ని రాష్టప్రతికి పంపుతారు. తెలంగాణాపై కేంద్రం పంపే డ్రాఫ్టు బిల్లు మెజారిటీ సభ్యులు ఆంధ్ర, రాయలసీమకు చెందిన వారు ఉన్న అసెంబ్లీ ఆమోదించే అవకాశమే లేదు. అందువల్ల మెజారిటీ సభ్యులు బిల్లును తిరస్కరించి పంపుతారు.అదే విషయాన్ని కేంద్రం రాష్టప్రతికి నివేదిస్తుంది. అప్పుడు రాష్టప్రతి నిర్ణయం తీసుకుని రాజ్యా ంగంలోని 3వ అధికరణ ప్రకారం విభజన చేయాల్సిందిగా సూచిస్తూ ేంద్రానికి ఆదేశాలిస్తారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతుంది. ఈ దశలో రాష్ట్ర అసెంబ్లీ తిప్పిపంపిన తీర్మానంపై బిజెపి లేదా ఇతర పక్షాలు లోక్‌సభలో తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఈ గందర గోళం మధ్య లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేయడమో లేదా ఓటింగులో పాల్గొనకపోవడమో భారతీయ జనతా పార్టీ చేయవచ్చు. ఇరు ప్రాంతాలను ఒప్పంచడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందని బిజెపి ఆరోపించి బయటకు రావచ్చు.

                  అదే సమయంలో హైదరాబాద్‌పై ఆంక్షలు ఇతర విషయాలను కూడా బిజెపి లోక్‌సభలో ప్రస్తావించి తెలంగాణా ప్రజలను శాంత పరిచే చర్యలు తీసుకునే అవకాశం ఉందని బిజెపి వర్గాలు వెల్లడించాయి. ఈ విధంగా చేయడం వల్ల ఇటు తెలంగాణాలో అటు సీమాంధ్రలో కూడా బిజెపికి మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బిజెపి వాకౌట్‌ చేసినా, ఓటింగులో పాల్గొనక పోయినా కూడా లోక్‌సభలో తెలంగాణా బిల్లు నెగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత రాజ్యసభలో తెలంగాణా బిల్లు నెగ్గే అవకాశం ఎటూ కనిపించడం లేదు.
ఆ ప్రక్రియ జరగాలంటే కాంగ్రెస్‌పార్టీ ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఎంత కసరత్తు చేసినా కూడా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మిగిలిన భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్‌కు సహకరించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఎన్నికలలోపు తెలంగాణా వచ్చే అవకాశాలు లేకుండా పోతాయని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తామే తెలంగాణా ఏర్పాటు చేస్తామని తెలంగాణా ఏర్పాటు కేవలం తమ వల్లే సాధ్యం అవుతుందని బిజెపి ఎన్నికలలో చెప్పుకునే వీలుంది. కాంగ్రెస్‌ పార్టీ చేతగాని తనం వల్లే తెలంగాణా ఏర్పాటు కాలేదనే అంశాన్ని బిజెపి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది

తేది.11-11-2013 నాటి వార్తలు








Saturday, November 9, 2013

ముందుకు పోతే నుయ్యి .. వెనక్కి పోతే గొయ్యి

ఓట్ల కోసం రాష్ట్ర విభజన మొదలు పెట్టారు ... ఇప్పుడు తెరాస తోక జాడించి విలీనం లేదు తొక్కా లేదు అని మడత కాజా పెట్టింది ...
ఇప్పుడు సీమాంధ్రలో అడ్రస్ లేకుండా పోవటమే కాకుండా తెలంగాణాలో గెలిచే అవకాశాలూ లేక .. అసలీ బలవంతపు రాష్ట్ర విభజన ఎందుకు చేస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకున్న కాంగ్రేస్సోళ్ళు...
ముందుకు పోతే నుయ్యి .. వెనక్కి పోతే గొయ్యి

Friday, November 8, 2013

'విభజన'కు తెలుగేతర శక్తులు కుట్రపన్నుతున్న వేళ ...



               దేశ స్వాతంత్ర్యానంతరం భాషాప్రయుక్త ప్రాతిపదికపైన ముందు ఆంధ్రరాష్ట్రంగా, ఆ పిమ్మట తెలుగుప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను కలుపుకుని మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి పురోభివృద్ధి చెందుతున్న తెలుగుజాతిని బలవంతంగా విడగొట్టే ప్రయత్నంలో చరిత్రలో మొదటిసారిగా జాతీయ కాంగ్రెస్ లోని, దాని కేంద్రప్రభుత్వంలోని తెలుగేతర శక్తులన్నీ ఏకమవుతున్న వేళ జాతి యావత్తు - మూడుప్రాంతాలలోని తెలుగుప్రజలూ ముప్పేటగా ప్రతిఘటించవలసిన తరుణం ఎప్పటికన్న కూడా ఇప్పుడు వచ్చింది; తెలుగుజాతి ఉనికిని భంగపరిచే కుట్రకు తెలుగేతరులతో చేతులు కలిపిన స్వార్థపరులూ, విద్రోహులూ తెలుగువారి మధ్యనే ఉండటం ఏమాత్రం సహించరాని పరిణామం. "ఇంటిదొంగల్ని ఈశ్వరుడైనా పట్టుకోలేడ''న్న సామెత వచ్చింది! ఈ ఇంటిదొంగల విద్రోహాన్ని కనిపెట్టిన తెలుగేతర శక్తులు ఆ దొంగల్ని వినియోగించుకుని "2009 డిసెంబర్ 9''న ఢిల్లీనుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు బీజం నాటేందుకు ముందుకొచ్చారు. ఈ "విభజన'' ప్రాతిపాదనకు కారకులైన స్థానిక విద్రోహులు ముగ్గురూ పచ్చి పదవీ కాంక్షాపరులూ, స్వార్థపరులూ, రాజకీయ నిరుద్యోగంతో "లంఖణాలు'' పడుతూ వచ్చిన సీమాంధ్రులే కావటం మరీ దారుణమైన పరిణామం. ఈ ముగ్గురూ జాతి చరిత్ర, దేశచరిత్రా తెలియని మూర్ఖులే.

            వీరిలో ఒకరు ఒక స్థానిక పార్టీకి అధ్యక్షుడూ, మాజీ ముఖ్యమంత్రీకాగా, మరొకరు మరో స్థానిక పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న ఒక మాజీమంత్రి, పచ్చి అవకాశవాదే గాకుండా ఒక ప్రాంతానికి ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి పదవికి 'ఏతాం' ఎత్తిన 'దొర', ఇంకో నాయకుడు లాడ్జింగ్ ల వ్యాపారంలో రకరకాల వ్యాపకాల కోసం లాడ్జింగ్ ల నిర్వహణలో కాకలు తీరడం ద్వారా రాజకీయాల్లోకి దూసుకువచ్చిన మహానుభావుడు, ఒక స్థానిక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడూ! వీరిలో ఒకరు తెలంగాణాకు వలసవచ్చి స్థానిక ప్రజల్ని దోపిడీ చేయడంలో మొనగాడుగా మారి, ఆ సంపదను రక్షించుకునేందుకు ముఖ్యమంత్రి పదవికోసం తెలంగాణా ప్రజల్ని ముఖ్యంగా దళితవర్గాల ప్రజలను నానాయాతనలు పెట్టడానికి 'ఉద్యమిం'చినవాడు; ఆ పదవీ స్వలాభం కోసం తోటి తెలుగు యువకులను, నిరుద్యోగ యువతను పచ్చిఅబద్ధాలతో తెలుగుజాతికే వ్యతిరేకంగా అనేక ప్రలోభాలతో ఉద్రేకపరిచి, బలవంతాన వందలాది మందిని ఆత్మహత్యల వైపు ప్రోత్సహించిన వాడు; ఆ క్రమంలో ఆ నేరం ఫలితంగా తనకు శిక్షలు పడకుండా తప్పించుకో జూస్తున్నాడు! ఈ ముగ్గురూ ఎవరో ఈసరికే అర్థమైపోయి ఉండాలి.

          ఈ ముగ్గురు తెలుగు "మరాఠీ''ల వ్యవహారసరళి గమనించిన తరువాత సోనియాసహా కేంద్ర కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలో కూడా "విదూషకులు'' తలెత్తారు. జాతి విభజన ప్రతిపాదనకు ముందు కాంగ్రెస్ అధిష్ఠానంలోని కేంద్రమంత్రి మండలిలోని తెలుగేతర శక్తులు చేసిన పని తెలుగుకు ప్రాచీన (శిష్ట) భాషా ప్రతిపత్తి దక్కకుండా కుట్రపన్నటం! ఈ బాపతులో ముఖ్యమైన చొరవచూపిన వాళ్ళు - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలోని డి.ఎం.కె.ముఠా భారతీయ భాషల్లో అత్యంత శక్తిమంతమైన ద్రావిడభాషా కుటుంబంలో అజంత భాషగానూ, యావత్తు ప్రాచ్యఖండపు భాషలలోనే "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'' (ప్రాచ్యాఖండపు ఇటలీభాష)గానూ నికోలమ్ కోంటీ కీర్తించిన తెలుగుభాషను తొక్కిపెట్టడానికి ప్రయత్నించడమేగాక, ప్రాచీన చరిత్రగల సంస్కృత భాషను కూడా పక్కనపెట్టి ముందుగా తమిళభాషకు శిష్ట భాష ప్రతిపత్తిని అధికారికంగా కుట్రద్వారా ప్రకటింపజేసుకున్నవారు కొందరు తమిళ మంత్రులు! ఆ తరువాతనే సంస్కృతానికి, తెలుగు, కన్నడ భాషలకు కూడా ప్రజాద్యోమాల ద్వారానే కేంద్రం శిష్టభాషా ప్రతిపత్తిని ప్రకటించకతప్పలేదు! ద్రావిడ భాషా కుటుంబంలో స్వతంత్రప్రతిపత్తితో మొట్టమొదటిసారిగా విడివడి తన తనాన్ని ఘనంగా చాటుకున్న భాష తెలుగేనని మరచిపోరాదు!

          అలా కేంద్రమంత్రి వర్గంలోని 'తమిళలాబీ'వర్గం ముందు తెలుగుభాషకు చిచ్చుపెట్టడానికి కాల్డువ్వి విఫలమైన తరువాత తెలుగుజాతిని చీల్చడానికి కూడా సిద్ధపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నిరుద్యోగులైన 'గుప్పిడు' నాయకుల స్వార్థప్రయోజనాలను పసికట్టిన తమిళపెద్దలు ఆ నాయకుల పదవీలాలసను వాడుకున్నారు; దాని ఫలితంగా కేంద్రంలో తమిళమంత్రి చిదంబరం నోటినుంచి వెలువడిందే - తెలంగాణా విభజనకు ''ప్రక్రియ (ప్రోసెస్) మొదలవుతుందన్న ప్రకటన! ఇక అక్కడినుంచి ఇటీవల దాకా ఆ ప్రక్రియను ఎలా ప్రారంభించి, ఎలా ముగించాలో పాలుపోక కుడితిలో పడిన ఎలుక మాదిరిగా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వమూ, రాష్ట్రంలోని నేను పైన ప్రస్తావించిన ఆ ముగ్గురు 'విదూషక' రాజకీయవేత్తలూ తన్నుకు చావవలసి వచ్చింది! సరిగ్గా ఈ సమయంలోనే తమిళనాడు మాజీముఖ్యమంత్రి కరుణానిధి ఒక ప్రకటనలో "తమిళనాడు రాష్ట్రంనుంచి మదురై రాజధానిగా దక్షిణ తమిళనాడు విడిపోవాలని సాగుతున్న వేర్పాటువాద ఉద్యమాన్ని గమనించకుండా ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదన ప్రక్రియను ఎలా చేపట్టావ''ని చిదంబరాన్ని వాయించ వలసివచ్చిందని మరచిపోరాదు.

              అది మొదలు - ఈ రోజువరకూ పొత్తు, పొంతనా లేని ప్రకటనలతో, పరస్పరం విరుద్ధమైన వ్యాఖ్యాలతో మంత్రులూ, కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలోని దిగ్విజయ్ సింగ్, షిండే, చాకో, వీరప్పమొయిలీ, గులామ్ నబీ ఆజాద్, సందీప్ దీక్షిత్ పోటాపోటీలతో తెలుగుజాతి విభజన ప్రతిపాదనపైనే కేంద్రీకరిస్తూ వచ్చారు! భాషాప్రయుక్త ప్రాతిపదికపైన అందులోనూ దశాబ్దాలపాటు కాంగ్రెస్ తీర్మానాలకు అనుకూలంగానూ, అదే కాంగెస్ తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగుజాతికి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి అదే కాంగ్రెస్ చేజేతులా స్వార్థప్రయోజనాల కోసం చీల్చాలని తపన పడుతోంది. అందుకు దారి కనపడకనే పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ప్రజల్ని గందరగోళ పరుస్తూ 'మానవద్వేషు'లు (శాడిస్టుల)లాగా వీరు తెలుగుజాతిని వారి మధ్య నెలకొన్న భవబంధాలనూ బలవంతంగా తెగ్గొట్టడానికి స్థానిక 'విదూషకు'లను తోలుబొమ్మలుగా కాంగ్రెస్ అధిష్ఠానం వాడుకొంటోంది. 'గురివింద గింజ' తన కింది 'నలుపు'ను ఎరుగనట్టే మహారాష్ట్రలో 'విదర్భ'ప్రాంతం, కర్ణాటకలోని 'కూర్గు', బెంగాల్ లోని 'గూర్ఖాలాండ్', తమిళనాడులోని దక్షిణ తమిళనాడులాంటి ప్రాంతాలు కోరుతున్న వేర్పాటువాదులను ఉద్యమాలను పట్టించుకోకుండా 42 మంది ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుల అండతో ఇంతకాలం ధైర్యంగా నిలబడుతూ వచ్చిన కాంగ్రెస్ కేంద్రప్రభుత్వం అకస్మాత్తుగా ఒక్క తెలుగుజాతి ఐకమత్యాన్నే ధ్వంసం చేయడానికి కారణం - రాష్ట్రంలోని గుప్పిడు విద్రోహుల ఉద్యమంతో పాటు ఎన్నికల అనంతరం కేంద్రంలో రకరకాల పదవులకోసం అర్రులుచాస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకుల తపన తప్ప మరొకటి కాదు.

          షిండే విదర్భ గురించి మాట్లాడడు, మొయిలీ కూర్గును గురించి ప్రస్తావించడు, గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రప్రతిపత్తి గురించి కేంద్రంలోని బెంగాల్ మంత్రులూ మాట్లాడరు. కాని వీరందరికీ ఆంధ్రప్రదేశ్ అన్నా, తెలుగుజాతి అన్నా కన్నెర్ర చేయడానికి సాహసిస్తారు. ఈ దుస్సాహసాన్ని తెలుగుజాతి తిప్పికొట్టడానికి సిద్ధమవుతారు. స్థానిక "బుడ్దర్ ఖాన్''ల, జాతి విద్రోహుల భరతాన్ని ప్రజలు పడతారు! ఆరునెలల స్నేహంలో "వారు వీరు, వీరు వారు అవుతార''న్న  సామెతకు తోడుగానే సుమారు 150 సంవత్సరాలపాటు దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలన ఫలితంగా వారి "విభజించి - పాలించే'' విధానాన్ని నేటి కాంగ్రెస్ నాయకత్వం అప్పనంగా "దత్త స్వీకార పధ్ధతి'' నమూనాలోనే అందిపుచ్చుకున్నది! అందుకు రాజ్యాంగంలో, స్వదేశ సంస్థానాలు భారత యూనియన్ లో చేరడానికి 'ససేమిరా' అంటూ, ఎవడికివాడు సొంత "రాజ్యాలు'' కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్న ఘడియలలో ఆ పరిణామాన్ని నివారించడం కోసం రాజ్యంగా నిర్ణేతలు అధికరణ (3)ను ప్రవేశపెట్టవలసి వచ్చింది; సరిగ్గా ఆ సమయంలోనే ముసాయిదా రాజ్యాంగానికి తుదిమెరుగులు దిద్దుతూ, ఉత్తరాత్టరా తమ "రాజ్యాల''లో [స్వదేశ సంస్థానాలు] స్వతంత్ర భారత పార్లమెంటును కాదని మొరాయించే పక్షంలో ఆ సంస్థానాలను విడగొట్టి వాటి అసహజమైన సరిహద్దుల్ని చెరిపి, ఆ సంస్థానాలను మరొక దానితో విలీనం చేసే స్వేచ్చను పార్లమెంటుకు దఖలు ఏర్పర్చడమే ఆ అధికరణ లక్ష్యం!

               కాని ఆ అధికరణ చాటున దాగి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని - అదే అధికరణను తన "సీట్ల''ను కాపాడుకోవడం కోసం, తన అధికారాన్ని ఎలాగోలా నిలుపుకోడం కోసం, ప్రత్యర్థుల విజయావకాశాలను దెబ్బతీయడం, పచ్చిస్వార్థంతో ప్రజలను చీల్చడం కోసం ఆ అధికరణ (3)ను ఉపయోగించడానికి అలవాటుపడింది. అంతేగాని, రాష్ట్రాల ప్రజల ప్రయోజనం కాదు. ప్రజల ప్రయోజనమే తన పరమావధి అనుకుంటే, రాజ్యాంగం అయిదవ షెడ్యూల్ ప్రకారం ఆదివాసీ, గిరిజన తెగల ప్రయోజనాలను కాపాడడం కోసం వలస చట్టాల్ని చించివేసి వారికి స్వపరిపాలనా ఏర్పాట్లు చేయాలి. కాని ఆ పని 65 సంవత్సరాల తర్వాత కూడా జరగలేదు. అందుకే గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక రాష్ట్రప్రతిపత్తి కల్పించాలన్న డిమాండూ ముందుకు రావలసి వచ్చిందని గ్రహించాలి!