కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలో బీజేపీకి శాశ్వత సమాధి!
రాష్ట్రంలో బీజేపీ పతనానికి సవాలక్ష కారణాలున్నాయి. లేటెస్ట్ గా బీజేపీకి భవిష్యత్తు లేకుండా చేసే గొప్ప పరిణామం కిషన్ రెడ్డి రూపంలో వచ్చిపడింది. ప్రత్యేక తెలంగాణా కోసం బీజేపీ పడుతున్న ప్రయాస ఆ పార్టీ అభివృద్ధికి ఏమాత్రం ఉపకరించదు. ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అన్న విషయంపై - మహబూబ్ నగరులో కిషన్ రెడ్డి మాట్లాడింది వింటే - ఇంత బుద్ధి తక్కువ వాదనలు చేసే వాళ్ళు కూడా పార్టీ అధ్యక్షులుగా చెలామణీ అయిపోవడం చూస్తే - బీజేపీ భవిష్యత్తు ఏమిటో అర్థమవుతుంది.
తెలంగాణా విభజనకు బీజేపీ - "చిన్న రాష్ట్రాలు - అభివృద్ధికి సోపానాలు" అనే కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వల్లే వేస్తోంది. మరోపక్క, తెలంగాణా ఉద్యమం "చిన్న రాష్ట్రాల సిద్ధాంతం'" కిందికి రాదు అని టీ జేఎసే తెగేసి చెబుతోంది. చిన్న రాష్ట్రాల ప్రాతిపదిక మీద రాష్ట్రాన్ని విభజించ దలచుకుంటే, వేరే విధంగా కూడా - ఇంకా చక్కని ముక్కలు చెయ్యవచ్చు. హైదరాబాద్ చుట్టూ తెలంగాణా ఒక ముద్దలా బాగానే ఉంటుంది. కానీ బలవంతంగా చీలుస్తున్న సేమాంధ్ర రాష్ట్రం ఎట్లా నిర్వహణాపరంగా సౌలభ్యమో చెప్పగలరా? సరైన ఇంటర్ కనెక్టివిటీ లేని ఆ పొడవాటి ముక్క ఎట్లా భౌగోళికంగా ఒక సమగ్రత ఉన్న చిన్న రాష్ట్రమో చెప్పగలరా?
మరో పిచ్చి వాదన చెప్పుకొచ్చాడు కిషన్ రెడ్డి: రెండు రాష్ట్రాలుగా ముక్కలు చేస్తే - సీమాంధ్రలో ఉద్యోగాలు పెరిగిపోతాయంట! ప్రాజెక్టులు వచ్చేస్తాయంట! కొత్త రోడ్లు వేసేస్తారంట ! నిధులు వస్తాయంట! కేంద్రీయ విశ్వ విద్యాలయాలు రెడీమేడ్ గా వచ్చేస్తాయట! పిచ్చోడా, లేక జనాలను వెర్రివాళ్ళు అనుకుంటాడా? రెండు ముక్కలు చేస్తే అంత షోకు ఉండేట్లయితే, రాష్ట్రాన్ని ఆరు ముక్కలు చెయ్యచ్చుగదా కిషన్ రెడ్డీ!
కోస్తా, రాయల సేమలో పార్టీని గాలికొదిలేసి, తెలంగాణా ప్రాపకంతో తన రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలన్న తపనే కనిపిస్తోందికానీ, పార్టీ భవిష్యత్తు, బీజేపీ లక్ష్యాల సాధనకోసం తపన మచ్చుకైనా కనపడటం లేదు! వ్యక్తిగత స్వార్థాల కోసం కొంత మంది తెలంగాణా బీజేపీ నేతల కపట విన్యాసమే బీజేపీ తెలంగాణా పోరాటం!

No comments:
Post a Comment