Menu bar





Showing posts with label national. Show all posts
Showing posts with label national. Show all posts

Friday, November 8, 2013

Saturday, November 2, 2013

Saturday, October 26, 2013

Sunday, October 20, 2013

Tuesday, October 15, 2013

అయ్యబాబోయ్... సమైక్య షాక్

అయ్యబాబోయ్... సమైక్య షాక్ అంటున్నారు, దాని విలువెంతో తెలిసాకా అందరు పని నోళ్లు వెల్లబెట్టడం తప్ప ఇప్పుడేం చేయలేని పరిస్థితి. కాంగ్రెస్ కేవలం తన రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న పనికి రెండు నెలల్లోనే జరిగిన నష్టం విలవ లక్ష, రెండు లక్షలో కాదు ఏకంగా 4 వేల కోట్లు. ఇది కూడా కేవలం ఉద్యోగులు చేసిన సమ్మె వల్లనే జరిగింది. అంటే ప్రైవేటు రంగంలో ఎంత లేదన్నా మరో 4 వేల కోట్లయితే ఉంటుందని అంచనా.
అంటే ఇప్పటి వరకు జరిగిన నష్టం దాదాపు ఎనిమిది వేల కోట్లన్నమాట. ఇది ఆగిందా.. అంటే అదీ లేదు, ఆర్టీసి, విద్యుత్ శాఖల వల్లే జరిగే నష్టం నివారించబడినా రాష్ట్రానికి అత్యధికంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సయిజ్, వాణిజ్య పన్నులతో పాటు మరెన్నో శాఖలకు సంబందించిన నష్టం జరుగుతూనే ఉంది. అంటే ఇది ఏ స్తాయికి చేరుకుంటుందో చెప్పలేని పరిస్థితి. అసలే ఆర్థికంగా కుదేలయిన ఆంద్రప్రదేశ్ ఇంత నష్టాన్ని పూడ్చుకుంటుందా, లేక ఇది ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలపై పడి చివరకు ప్రజలే బలవుతారా... అంటే నిపుణులు మాత్రం ప్రజలే అంటున్నారు.
ఇప్పటి వరకు వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం 500 కోట్లు, రవాణా, మోటారు, వాహనాల పన్ను వంటి వాటి ద్వారా వచ్చే ఆదాయం 210 కోట్లు, ఎక్సయిజ్ ద్వారా వచ్చేది 380 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 350 కోట్ల నష్టం  జరిగింది. అలాగే గనులు, భూగర్భవనరులు ద్వారా వచ్చే ఆదాయం 150 కోట్లు, పన్నేతర ఆదాయం 193 కోట్ల నష్టం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా ఈ అనిస్చితికి తెరదించకుండా కేంద్రం చోద్యం చూస్తుండడం, హైకమాండ్ పెద్దలు రోజుకో తీరు మాట మారుస్తూ ఇంకా ఈ ఉద్యమాన్ని రెచ్చగొడుతుండడం దారుణం.

Monday, October 14, 2013

10 జనపథ్ వద్ద చుక్కలు చూపిన తెలుగు మహిళలు

                    తెలుగు దేశం పార్టీకి చెందిన తెలుగు మహిళలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటిని ముట్టడించి పోలీసులకు చుక్కలు చూపించారు. శనివారం తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్షను భగ్నం చేయడంతో తెలుగు మహిళలు సోనియా ఇంటిని ముట్టడించారు. మొదట టిడిపి ప్రజాప్రతినిధులు సోనియా ఇంటిని ముట్టడించారు. ఈ విషయం ఆలస్యంగా తెలుగు మహిళలకు తెలిసింది. విషయం తెలియగానే తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి ఆధ్వర్యంలో మహిళా నాయకులు 10 జన్‌పథ్‌కు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఇటలీ లేడీ.. సోనియా కేడీ అంటూ నినాదాలు చేశారు. మహిళా పోలీసులు తక్కువగా ఉండటంతో వీరిని అరెస్టు చేసి వాహనాల్లోకి ఎక్కించడం ఇబ్బందిగా మారింది. అక్కడే బైఠాయించిన వారు అరగంట తర్వాత ఒక్కసారిగా లేచి సోనియా ఇంటిలోకి జొరబడే యత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ.. సోనియాకు మంచిగా చెబుతుంటే అర్థం కావటం లేదని, అందుకే ఆమె ఇంటికే వచ్చి తెలుగు ప్రజల గోడు వినిపిస్తున్నామన్నారు. ఆమె దేశాన్ని నడిపిస్తున్న నాయకురాలే అయితే, ప్రజల కోసం పని చేసే నాయకురాలే అయితే తక్షణం బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె ఇంట్లో ఎందుకు దాక్కుంటోందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు. తెలుగు ప్రజలతో ఆటలాడుకుంటున్న ఆమె తెలుగు జాతికి ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. సోనియా కనుక బయటకు వచ్చి సమాధానం చెప్పకపోతే ఇటలీ వరకూ వెంటపడి తరుముతామన్నారు.

Sunday, October 13, 2013

విదేశాలకు వెళ్ళినా సమైక్యాంధ్రే!

విదేశాలలో ప్రధానిని వెంటాడిన సమైక్య ఉద్యమం!

భారత ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ వెంట మీడియా బృందంలో ఒకడిగా ఆగ్నేయాసియా దేశాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఇండోనేషియాలో పర్యటిస్తున్న నాకు ఇక్కడి మీడియా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల కిస్తున్న ప్రాధాన్యత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఆసియాలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వాణిజ్య, సాంకేతిక సహకార ఒప్పందాలపై ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇందుకోసం మన్మోహన్‌ వెంట భారత పరిశ్రమల సమాఖ్యతో పాటు వివిధ వర్గాలకు చెందిన బృందాలు తరలొచ్చాయి. ఢిల్లినుంచి నేరుగా బ్రూనే చేరుకున్న మా బృందం రెండో రోజు జకార్తా కొచ్చింది. మీడియా బృందంలో జాతీయ, అంతర్జాతీయ సమాచార వ్యవస్థ ప్రతినిధులున్నారు. ప్రధాని ప్రయాణించిన ప్రత్యేక విమానంలో జరిగిన మీడియా సమావేశం నుంచి జకార్తాలో ప్రధాని ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూల నుంచీ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఏదొక సందర్భంలో సీమాంధ్రలో సాగుతున్న సమైక్య ఉద్యమం ప్రస్తావనకొస్తూనే ఉంది.

తొలిరోజు ప్రధాని అంతర్గత వ్యవ హారాల సలహాదారుడితో జరిగిన మీడియా సమావేశంలో కూడా ఇదే కీలకాంశమైంది. తెలంగాణా విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని ఎలా సంతృప్తిపర్చగలరంటూ మీడియా ఆయన్ను ప్రశ్నించింది. సీమాంధ్రుల సందేహాల్ని నివృత్తి చేయకుండా విభజన ఎలా చేయగలరంటూ కూడా నిలదీసింది. జకార్తాలో ప్రధాని పర్యటనకు అనూహ్య స్పందన వచ్చింది. ఇండోనేషియాలోని అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న పత్రికల నుంచి అంతర్జాతీయంగా వెలువడే ఇంగ్లీషు పత్రికల వరకు అన్నింట్లోనూ ప్రధాని పర్యటనను ప్రముఖంగా ప్రచురించారు.

వీటిలో కూడా భారత్‌లో కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదన అనంతరం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని మన్మోహన్‌ ఆగ్నేయాసియా దేశాల పర్యటన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందంటూ పత్రికలు వ్యాఖ్యానించాయి. సీమాంధ్ర ఉద్యమానికి జాతీయస్థాయి గుర్తింపు దక్కలేదన్న ఆవేదన అక్కడి ప్రజల్లో నెలకొంది. ముఖ్యంగా హిందీ, ఇంగ్లీష్‌ ఛానల్స్‌ ఈ ఉద్యమాన్ని పెద్దగా ప్రసారం చేయడంలేదన్న భావనుంది. కానీ ఈ పర్యటనలో నాకు సీమాంధ్ర ఉద్యమ ప్రభావం స్పష్టంగా తేటతెల్లమైంది. అహింసాయుతంగా, మహాత్మాగాంధీ విధానంలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలోని రాజకీయవేత్తలు, పార్టీలు గుర్తించక పోవచ్చు. కానీ అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించగలిగింది.

న్యూయార్క్‌ నుంచి వెలువడే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆసియా ఎడిషన్‌లో శుక్రవారం ప్రచురించిన ప్రధాని పర్యటన వార్తల్లో సీమాంధ్ర ఉద్యమ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆగ్నేయాసియా దేశాలు చైనాతో ఎ దుర్కొంటున్న సమస్యలపై రెండ్రోజుల క్రితం లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రికలో రాసిన కథనంలో కూడా భారత్‌లో నెలకొన్న పలు సమస్యల్ని పేర్కొన్నారు. అందులో సమైక్యాంధ్ర ఉద్యమం కూడా ఒక కీలకసమస్యగానే రాశారు. ఇలాంటి సమస్యల నేపథ్యంలో మన్మోహన్‌ అంత ర్జాతీయ వేదిక ఎక్కుతున్నట్లుగా పేర్కొన్నారు.

ఇండోనేషియా జాతీయ పత్రికలు కోంపస్‌, యనాలిసా, సౌరకార్య, రిపబ్లికన్‌లలో కూడా భారత ప్రధాని పర్యటన వార్తల్లో సమైక్యాంధ్ర ఉద్యమ అంశాన్ని పేర్కొన్నారు. ఇండోనేషియాలో జరిగిన మీడియా సమావేశంలో కూడా భారత్‌లో కొత్త రాష్ట్ర ఏర్పాటు అంశం ప్రస్తావనకొచ్చింది. కోంపస్‌ పత్రికకు ప్రధాని ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా భారత అంతర్గత సమస్యలపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఒక్క జాతీయ పత్రికల్లోనే కాదు.. జకార్తా నుంచి వెలువడే ప్రాంతీయపత్రికలు కోరన్‌, పోస్‌కోట్టా, పపువా ప్రాంతంలో అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న సెండెరవాశిక్‌ పోస్‌, తూర్పు కలిమంటన్‌ ప్రాంతం నుంచి వెలువడే గావి, మానుంటుంగ్‌లలో కూడా భారత్‌లో రాష్ట్ర విభజన ఉద్యమ వార్తల్ని ప్రచురించారు.

ఇక చైనా నుంచి వెలువడే జింహాంగ్‌ పోస్ట్‌ పత్రికలో ఓ వైపు భారత్‌ పలు అంతర్గత వివాదాలతో సతమతమౌతుంటే ఆ దేశ ప్రధాని వ్యాపార ఒప్పందాల కోసం తిరుగుతున్నారంటూ ప్రస్తుతం దేశంలో నెలకొన్న టెర్రరిజం, నక్సలిజం, విభజనవాద ఉద్యమాల గురించి ప్రస్తావించారు. ఇండోనేషియాలో అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న ఇంగ్లీష్‌ పత్రిక బాలి టైమ్స్‌ ఇంటర్వ్యూలో కూడా ప్రధానిని దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేక ఉద్యమాలు, కొత్త రాష్ట్ర ఏర్పాటు వివాదాల అంశంపై ప్రశ్నలు సంధించారు.

Saturday, October 12, 2013

సీమాంధ్రకు 25 కంపెనీల పారా మిలటరీ బలగాలు

సీమాంధ్రకు 25 కంపెనీల పారా మిలటరీ బలగాలు

తెలంగాణ నోట్ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. శాంతి భద్రతలు అదుపుతప్పకుండా చూసేందుకు అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 45 కంపెనీల పారామిలటరీ బలగాలు ఉన్నాయి. అదనంగా 25 కంపెనీల పారా మిలటరీ బలగాలు కావాలని కేంద్రాన్ని కోరింది. కోయంబత్తూరు నుంచి 15, కోల్కతా నుంచి 10 పారామిలటరీ బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. కేంద్ర కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం అదనపు బలగాలు కోరినట్టు సమాచారం.



Friday, October 11, 2013

Thursday, October 10, 2013




ఢిల్లీలో కాంగ్రెస్‌పార్టీ అధిష్ఠానానికి సీమాంధ్ర విద్యుత్‌షాక్‌ తగిలింది. రాష్టవ్రిభజనను నిరసిస్తూ రెండు నెలలకు పైగా సమ్మెలు ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోని కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం సీమాంధ్ర జిల్లాల్లో విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మెతో రెండురోజులకే ఉద్యమ షాక్‌ తట్టుకోలేక గిలగిల లాడిపోతున్నది. రాష్ట్ర విభజనపై ఇంతకాలం రాష్ట్ర నేతతో కరుకుగా , ఉద్యమంపట్ల తేలిక భావంతో వ్యవహరిస్తూ వచ్చిన కాంగ్రెస్‌పార్టీ పెద్దల్లో విద్యుత్‌ షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఫలితామా అన్నట్టు మార్పు స్పష్టంగా కనిపిస్తోందని సీమాంధ్రకు చెందిన ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వటంతో సీమాంద్ర ఉద్యమానికి వేల మెగావాట్ల శక్తి పుట్టుకొచ్చినట్లయింది. ఎక్కడికక్కడ విధులు బహిష్కరిచంటంతో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది.

విద్యత్‌ ఉద్యోగుల సమ్మెప్రభావం తొలి రోజే రైల్వేశాఖపై షార్ట్‌ సర్యూట్‌లా పనిచేసింది. రాష్ట్రంలో నడిచే పలు రైళ్లపై ఉద్యమ ప్రభావం పడింది. ఇక రోండరోజు కూడా అధికారులు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంతగా ఫలితమివ్వలేదు. మంగళవారం విశాఖ-విజయవాడ మధ్య రైళ్ళ రాకపోకలు నిలిపివేయక తప్పలేదు. భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌ -పుదుచ్చేరి వీక్లి, విశాఖ-భువనేశ్వర్‌ ఇంటర్‌సిటి, విశాఖ-చత్తీస్‌గడ్‌తోపాటుగా ఒడిస్సా వెళ్లే అన్ని రైళ్లు రద్దు చేస్తున్నట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు ప్రకటించారు. రాష్ట్రం మీదుగా నడిచే పలు రైళ్లకు ఆటంకాలు , ప్రతిష్టంభనలతో వేలాది మంది ఇతర రాష్ట్రాల ప్రయాణీకులు రైల్లేస్టేషన్లలో నిద్రాహారాలు మాని పడుగాపులు కాస్తున్నారు. స్టేషన్లలో అలుముకున్న చీకట్లు మరింత చికాకు పెడుతున్నాయి.

దేశ చిత్ర పటంలో దేహంలోని రక్తనాళాల్లా కనిపించే రైలు మర్గాలపై ఒక్క చోట రైళ్లు నిలిచిపోయినా ఆ ప్రభావం దేశమంతటా చూపుతోంది. సీమాంధ్రలో జరుగతున్న సమ్మె ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన పరిస్తితులపై రైల్వేబోర్డు అధికారులు కేంద్రప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తాజగా దక్షిణమధ్యరైల్వే ఉన్నతాధికారులు మంగళవారం మరోమారు సమావేశం నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. అధికారులు ఉద్యమ ప్రభావానికి ఎదురీది రైళ్లు నడపటం ప్రమాదపు అంచుల్లో ప్రయాణంగా మారిందని కేంద్ర ప్రభుత్నాకి సమాచారం అందచేశారు. గూడ్స్‌లను నిలిపి వాటి ఇంజన్లతో కూడా రైళ్లు నడుపుతామని నిర్ణయించినా అంత సువువుకాదని అధికారులే చెబుతున్నారు.

అస్పత్రుల్లో ఆక్రందనలు..
ఉద్యోగుల సమ్మెతో విద్యుత్‌ సరపరాలేక ఆస్పత్రుల్లో రోగులు ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. సాధారణ అపరేషన్లు నిలిపివేశారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో తప్పని సరి ఆపరేషన్లను మాత్రమే జనరేటర్ల ద్వారా నడిపిస్తున్నట్టు ప్రముఖ కార్పోరేట్‌ ఆస్పత్రి వైద్యులొకరు పేర్కొన్నారు. సీమాంధ్ర జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆ పరిస్థితికూడా లేకుండా పోయింది. కొన్నింటికి జనరేటర్లు ఉన్నా ఆవి పనిచేయకపోవటంతో ఆపరేషన్లు నిలిచిపోయాయంటున్నారు. విద్యుత్‌ లేక ప్యాన్లు తిరగక చీకట్లో చికిత్సపొందుతున్న రోగులు అలమటించిపోతున్నారు. మరోవైపు విద్యుత్‌ సమ్మె ప్రభావం సీమాంధ్రలో తాగునీటి పథకాలను ఎండగడుతోంది. మోటర్లుపంపులు పనిచేయక తాగునీటిసరఫరా మంగళవారం నుంచి మరింత ఇబ్బందిగా మారింది. ఇప్పటికే వందల సంఖ్యలో గ్రామాలు పట్టణాలు తాగునీటికి కటకట మంటున్నా యి. కొని తాగుదామన్నా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు విద్యుత్‌ కొరతతో పనిచేయటంలేదు.

మూగబోయిన పరిశ్రమలు
విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెప్రభావంతో సీమాంద్ర జిల్లాల్లో అన్ని రకాల పరిశ్రమలు మూగబోయాయి. విద్యుత్‌ సరఫ రాలేక ప్రత్యామ్నాయంగా తొలి రెండు రోజులు జనరేటర్ల ద్వా రా ఏలాగోలా నెట్టుకొచ్చినా మంగళవారం ఇక చేతకాక పరిశ్ర మలకు ఆటవిడుపు ప్రకటించకతప్పలేదని విజయవాడకు చెందిన పారిశ్రామివేత్త ఒకరు సమ్మెకష్టాలను వివరించారు. వి ద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేత వ్యాపార సంస్థలకు కూడా భారంగానే మారింది. దసరా పండగసీజన్‌ కావటంతో విద్యుత్‌లేక అటు జనరేటర్లపై గంటలతరబడి నడిపించలేక సతమతమవుతున్నా రు. సీమాంధ్ర జిల్లాలో విదుత్‌ చార్జీంగ్‌ అయిపోయిన సెల్‌పో న్స్‌ కూడా పనిచేయటంలేదు. రిచార్జింగ్‌కు విద్యుత్‌సరఫరాలేక వేలమంది వినియోగదారులు గిలగిలలాడుతున్నారు.

ఢిలీ్లి తాకిన విద్యుత్‌ ప్రకంపనలు
సీమాంధ్ర జిల్లాల్లో విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన సమక్య ఉద్యమ ప్రకంపనలు దేశరాజధాని డిల్లీని తాకాయి. రైళ్ల నిలిపివేత మెదలుకుని కేంద్రసర్వీసులతోపాటు విద్యుత్‌ ప్రభావంతో తలెత్తిన సమస్యలు కాంగ్రెస్‌పార్టీ హైకంమాం డ్‌ను గట్టిషాక్‌ ఇచ్చాయంటున్నారు. నిన్నటిదాక సమైక్యాంద్ర ఉద్యమంపై చులకనభావంతో పట్టీపట్టు ఉంటూ వచ్చిన కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంజార్జి దిగ్విజయ్‌సింగ్‌ స్వరం మార్చారు. పైకి ఈదశలో రాష్టవ్రిభజన నిర్ణయం వెనక్కుతీసుకోలేమని మేకపోతు గాంభీర్యాన్ని నటిస్తున్నా, సీ మాంధ్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించా రు. సీమాంద్రపై పూర్తిస్ధాయిలో దృష్టి పెట్టామన్నారు.

అస్పత్రుల్లో రోగులతోపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా సమ్మె విరమించాలని ఉద్యోగులకు దిగ్విజయ్‌సింగ్‌ విజ్ఞప్తి చేశారు. హైకంమాండ్‌లో కనిపిస్తున్న మార్పే ఇందుకు కారణమా అన్నదిశగా సీమాంధ్రకాంగ్రెస్‌నేతలు అలోచిస్తున్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలపై ఇంతకాలం ఆ ప్రాంత నేతలు కేంద్రమంత్రులు చెబుతువచ్చిన వాటిని ఇపుడు చెవికెక్కించుకుంటున్నారు. ఇదే పరిస్థితులు కొనసాగితే ఇక రాయలసీమ, కోస్తా ప్రాంతంలో కాంగ్రెస్‌పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందన్న భయం కూడా వారిలొ కనిపిస్తోందంటున్నారు. ఈ నేపద్యంలోనే ఉద్యోగుల సమ్మెవిరమణకోసం ముఖ్యమంత్రిపై వత్తిడి పెంచుతున్నట్టు కాంగ్రెస్‌పార్టీ ముఖ్యులొకరు పేర్కొన్నారు

Saturday, October 5, 2013