మా గ్రామాల్లో, పట్టణాల్లో, చిన్న నగరాల్లో ఉండే డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, చదువుకున్నవాళ్ళు, పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ..
అనగా ఆర్ధికంగా ప్రగతి సాధించినవారు, ట్యాక్స్ లు కట్టే సామర్ధ్యం ఉన్నవాళ్ళు అందరూ.. మన రాష్ట్ర రాజధాని, మహానగరమైన హైదరాబాద్ కు వలసపోయారు. ఇక ముందు కూడా చదువు, ఉద్యోగం, వ్యాపారం కోసం రాజధానికి వలస పోవాల్సిన అనివార్య పరిస్తితి ఉంది.
ఇంకా ఈ ప్రాంతంలో మిగిలింది పేదలు, చిరు ఉద్యోగులు లాంటి ప్రభుత్వ పధకాల పైన మరియు ప్రభుత్వ జీతాల పైన ఆధారపడి బ్రతికే బలహీన వర్గాలు.
ఇప్పుడు ఆ మహానగరం లో వచ్చే ఆదాయం అంతా.. ఒక ప్రాంతానికి ఇస్తే.. ఈ రాష్ట్రానికి ఆధాయ వనరులు ఎక్కడి నుండి వస్తాయి?
ఆ మహానగర అభివృద్డిలో మా ప్రాంత ప్రజల భాగస్వామ్యం ఉంది.. అలాంటి మహానగరం ఒక్కటి కూడా మా ప్రాంతంలో తయారు కాలేదు.
నలభై ఏళ్ల క్రితం విడగొట్టి ఉంటే ఇప్పుడు మా రాజధాని ఇలా ఉండెదా?
No comments:
Post a Comment