Menu bar





Thursday, October 3, 2013

టి. నోట్ ఆమోదిస్తే... ప్రధాని ఇంటిముందు ఆత్మాహుతి... సమైక్య విద్యార్థులు

తెలంగాణ నోట్ ను కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇంటి ముందు ఆత్మాహుతి చేసుకుంటామని సమైక్య ఉద్యమం చేస్తున్న విద్యార్థులు హెచ్చరించారు. గురువారంనాడు సాయంత్రం ప్రధానమంత్రి ఇంట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి ముందు 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. ఒక దశలో విద్యార్థులు ప్రధాని మన్మోహన్ ఇంట్లోకి ప్రవేశించేందుకు గేట్లు ఎక్కారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు టి. నోట్ కేంద్ర కేబినెట్ ముందుకు టేబుల్ అంశంపై వస్తుందంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వెనువెంటనే తెలంగాణ బిల్లును ఉపసంహరించుకోవాలనీ, లేదంటే ప్రధానమంత్రి ఇంటి ముందు ఆత్మ బలిదానాలు చేసుకుంటామని వారు అన్నారు.

No comments:

Post a Comment