రాష్ట్రపతి పాలనకే రంగం సిద్ధమా?
తెలంగాణాపై వెనక్కు తగ్గేదే లేదు - ఎన్నికల సంగతి తర్వాత తేల్చు కుందాం. తెలంగాణా విషయంలో లొంగిపోతే, దేశంలో ఇక ఎవ్వరూ మనల్ని లెక్క చెయ్యరు - అనే భావోద్వేగంలో మేడం పడిపోయినట్లు కనిపిస్తోంది.
వీలయితే, అసెంబ్లీకి బిల్లు పంపించాకుండానే - నేరుగా పార్లమెంటులో ప్రవేశపెట్టి - రాష్ట్రాన్ని రెండుగా చీల్చి వెయ్యడమే ఉత్తమం - అని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రాజ్యాంగ ప్రక్రియను జవదాటం - బిల్లు అసెంబ్లీకి రెండు మార్లు వస్తుం; అంతా పధ్ధతి ప్రకారమే చేస్తాం - అని దిగ్విజయ్ సింగ్ - నిన్న ప్రకటించాడు. అయితే, వెంటనే హొమ్ శాఖ దానికి స్పందించింది. ప్రక్రియ ఎట్లా ముందుకు సాగుతుందో ఇంకా నిర్దిష్టంగా నిర్ణయం కాలేదు; ఇంకా ఏమే నిర్ణయం కాలేదని. ఆయనకీ క్లాసు తీసుకుంటారు అన్నట్లుగా రాజధానిలో గుప్పుమంది.
అసెంబ్లీని బైపాస్ చెయ్యాలంటే, రాష్ట్రపతి పాలన ఒక్కటే శరణ్యం. ఆ తర్వాత - ప్రక్రియ అంతా తూతూ మంత్రం చందమే! రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులలో - ఏవో కుంటిసాకులు చూపి - రాష్ట్రపతి పాలన పెట్టినా - అదికొరివితో తల గోక్కోవడమే అవుతుంది. ప్రజలనిలా వరుసగా అవమానాల పాలు చేస్తే, జనం హద్దులు మీరతారని కేంద్రం గ్రహించాలి. ఇప్పటికే చాలా తప్పులు చేసిన కేంద్రానికి రాష్ట్రపతి పాలన చివరితప్పు అవుతుంది.
తెలంగాణా విషయంలో పూనకం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న కేంద్రం - ఆ చివరి తప్పు చెయ్యడం నుంచి తనను తాను నిగ్రహించుకోలేక పోవచ్చు! అయితే, రాష్ట్రపతి పాలన విధించడానికి ప్రణబ్ ముఖర్జీ అంగీకరించక పోవచ్చు పైగా. కొత్త రాష్ట్రాల ఏర్పాటు వలన వచ్చే డామినో ఎఫెక్ట్ గురించి కూడా ఆయన హెచ్చరించవచ్చు. అయినా తెలంగాణా విషయంలో ఎవరి మాటా వినను! అని మేడం అంటే ... ప్రాప్త కాలజ్ఞత నశిస్తే ... "వినాశ కాలే విపరీత బుద్ధి!" అన్నది రుజువుకాక మానదు!
No comments:
Post a Comment