ఢిల్లీలో
కాంగ్రెస్‌పార్టీ అధిష్ఠానానికి సీమాంధ్ర విద్యుత్‌షాక్ తగిలింది.
రాష్టవ్రిభజనను నిరసిస్తూ రెండు నెలలకు పైగా సమ్మెలు ఉద్యమాలు చేస్తున్నా
పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సీమాంధ్ర జిల్లాల్లో విద్యుత్
ఉద్యోగులు చేపట్టిన సమ్మెతో రెండురోజులకే ఉద్యమ షాక్ తట్టుకోలేక గిలగిల
లాడిపోతున్నది. రాష్ట్ర విభజనపై ఇంతకాలం రాష్ట్ర నేతతో కరుకుగా ,
ఉద్యమంపట్ల తేలిక భావంతో వ్యవహరిస్తూ వచ్చిన కాంగ్రెస్‌పార్టీ
పెద్దల్లో విద్యుత్ షాక్ ట్రీట్‌మెంట్ ఫలితామా అన్నట్టు మార్పు
స్పష్టంగా కనిపిస్తోందని సీమాంధ్రకు చెందిన ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగ
సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వటంతో సీమాంద్ర ఉద్యమానికి వేల మెగావాట్ల
శక్తి పుట్టుకొచ్చినట్లయింది. ఎక్కడికక్కడ విధులు బహిష్కరిచంటంతో
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది.
విద్యత్ ఉద్యోగుల సమ్మెప్రభావం తొలి రోజే రైల్వేశాఖపై షార్ట్ సర్యూట్‌లా పనిచేసింది. రాష్ట్రంలో నడిచే పలు రైళ్లపై ఉద్యమ ప్రభావం పడింది. ఇక రోండరోజు కూడా అధికారులు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంతగా ఫలితమివ్వలేదు. మంగళవారం విశాఖ-విజయవాడ మధ్య రైళ్ళ రాకపోకలు నిలిపివేయక తప్పలేదు. భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ -పుదుచ్చేరి వీక్లి, విశాఖ-భువనేశ్వర్ ఇంటర్‌సిటి, విశాఖ-చత్తీస్‌గడ్‌తోపాటుగా
ఒడిస్సా వెళ్లే అన్ని రైళ్లు రద్దు చేస్తున్నట్టు తూర్పు కోస్తా రైల్వే
అధికారులు ప్రకటించారు. రాష్ట్రం మీదుగా నడిచే పలు రైళ్లకు ఆటంకాలు ,
ప్రతిష్టంభనలతో వేలాది మంది ఇతర రాష్ట్రాల ప్రయాణీకులు రైల్లేస్టేషన్లలో
నిద్రాహారాలు మాని పడుగాపులు కాస్తున్నారు. స్టేషన్లలో అలుముకున్న చీకట్లు
మరింత చికాకు పెడుతున్నాయి.
దేశ చిత్ర పటంలో దేహంలోని రక్తనాళాల్లా కనిపించే రైలు మర్గాలపై ఒక్క చోట రైళ్లు నిలిచిపోయినా ఆ ప్రభావం దేశమంతటా చూపుతోంది. సీమాంధ్రలో జరుగతున్న సమ్మె ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన పరిస్తితులపై రైల్వేబోర్డు అధికారులు కేంద్రప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తాజగా దక్షిణమధ్యరైల్వే ఉన్నతాధికారులు మంగళవారం మరోమారు సమావేశం నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. అధికారులు ఉద్యమ ప్రభావానికి ఎదురీది రైళ్లు నడపటం ప్రమాదపు అంచుల్లో ప్రయాణంగా మారిందని కేంద్ర ప్రభుత్నాకి సమాచారం అందచేశారు. గూడ్స్‌లను నిలిపి వాటి ఇంజన్లతో కూడా రైళ్లు నడుపుతామని నిర్ణయించినా అంత సువువుకాదని అధికారులే చెబుతున్నారు.
అస్పత్రుల్లో ఆక్రందనలు..
ఉద్యోగుల సమ్మెతో విద్యుత్ సరపరాలేక ఆస్పత్రుల్లో రోగులు ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. సాధారణ అపరేషన్లు నిలిపివేశారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో తప్పని సరి ఆపరేషన్లను మాత్రమే జనరేటర్ల ద్వారా నడిపిస్తున్నట్టు ప్రముఖ కార్పోరేట్ ఆస్పత్రి వైద్యులొకరు పేర్కొన్నారు. సీమాంధ్ర జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆ పరిస్థితికూడా లేకుండా పోయింది. కొన్నింటికి జనరేటర్లు ఉన్నా ఆవి పనిచేయకపోవటంతో ఆపరేషన్లు నిలిచిపోయాయంటున్నారు. విద్యుత్ లేక ప్యాన్లు తిరగక చీకట్లో చికిత్సపొందుతున్న రోగులు అలమటించిపోతున్నారు. మరోవైపు విద్యుత్ సమ్మె ప్రభావం సీమాంధ్రలో తాగునీటి పథకాలను ఎండగడుతోంది. మోటర్లుపంపులు పనిచేయక తాగునీటిసరఫరా మంగళవారం నుంచి మరింత ఇబ్బందిగా మారింది. ఇప్పటికే వందల సంఖ్యలో గ్రామాలు పట్టణాలు తాగునీటికి కటకట మంటున్నా యి. కొని తాగుదామన్నా మినరల్ వాటర్ ప్లాంట్లు విద్యుత్ కొరతతో పనిచేయటంలేదు.
మూగబోయిన పరిశ్రమలు
విద్యుత్ ఉద్యోగుల సమ్మెప్రభావంతో సీమాంద్ర జిల్లాల్లో అన్ని రకాల పరిశ్రమలు మూగబోయాయి. విద్యుత్ సరఫ రాలేక ప్రత్యామ్నాయంగా తొలి రెండు రోజులు జనరేటర్ల ద్వా రా ఏలాగోలా నెట్టుకొచ్చినా మంగళవారం ఇక చేతకాక పరిశ్ర మలకు ఆటవిడుపు ప్రకటించకతప్పలేదని విజయవాడకు చెందిన పారిశ్రామివేత్త ఒకరు సమ్మెకష్టాలను వివరించారు. వి ద్యుత్ ఉత్పత్తి నిలిపివేత వ్యాపార సంస్థలకు కూడా భారంగానే మారింది. దసరా పండగసీజన్ కావటంతో విద్యుత్‌లేక అటు జనరేటర్లపై గంటలతరబడి నడిపించలేక సతమతమవుతున్నా రు. సీమాంధ్ర జిల్లాలో విదుత్ చార్జీంగ్ అయిపోయిన సెల్‌పో న్స్ కూడా పనిచేయటంలేదు. రిచార్జింగ్‌కు విద్యుత్‌సరఫరాలేక వేలమంది వినియోగదారులు గిలగిలలాడుతున్నారు.
ఢిలీ్లి తాకిన విద్యుత్ ప్రకంపనలు
సీమాంధ్ర జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమక్య ఉద్యమ ప్రకంపనలు దేశరాజధాని డిల్లీని తాకాయి. రైళ్ల నిలిపివేత మెదలుకుని కేంద్రసర్వీసులతోపాటు విద్యుత్ ప్రభావంతో తలెత్తిన సమస్యలు కాంగ్రెస్‌పార్టీ హైకంమాం డ్‌ను గట్టిషాక్ ఇచ్చాయంటున్నారు. నిన్నటిదాక సమైక్యాంద్ర ఉద్యమంపై చులకనభావంతో పట్టీపట్టు ఉంటూ వచ్చిన కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంజార్జి దిగ్విజయ్‌సింగ్ స్వరం మార్చారు. పైకి ఈదశలో రాష్టవ్రిభజన నిర్ణయం వెనక్కుతీసుకోలేమని మేకపోతు గాంభీర్యాన్ని నటిస్తున్నా, సీ మాంధ్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించా రు. సీమాంద్రపై పూర్తిస్ధాయిలో దృష్టి పెట్టామన్నారు.
అస్పత్రుల్లో రోగులతోపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా సమ్మె విరమించాలని ఉద్యోగులకు దిగ్విజయ్‌సింగ్ విజ్ఞప్తి చేశారు. హైకంమాండ్‌లో కనిపిస్తున్న మార్పే ఇందుకు కారణమా అన్నదిశగా సీమాంధ్రకాంగ్రెస్‌నేతలు అలోచిస్తున్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలపై ఇంతకాలం ఆ ప్రాంత నేతలు కేంద్రమంత్రులు చెబుతువచ్చిన వాటిని ఇపుడు చెవికెక్కించుకుంటున్నారు. ఇదే పరిస్థితులు కొనసాగితే ఇక రాయలసీమ, కోస్తా ప్రాంతంలో కాంగ్రెస్‌పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందన్న భయం కూడా వారిలొ కనిపిస్తోందంటున్నారు. ఈ నేపద్యంలోనే ఉద్యోగుల సమ్మెవిరమణకోసం ముఖ్యమంత్రిపై వత్తిడి పెంచుతున్నట్టు కాంగ్రెస్‌పార్టీ ముఖ్యులొకరు పేర్కొన్నారు
విద్యత్ ఉద్యోగుల సమ్మెప్రభావం తొలి రోజే రైల్వేశాఖపై షార్ట్ సర్యూట్‌లా పనిచేసింది. రాష్ట్రంలో నడిచే పలు రైళ్లపై ఉద్యమ ప్రభావం పడింది. ఇక రోండరోజు కూడా అధికారులు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంతగా ఫలితమివ్వలేదు. మంగళవారం విశాఖ-విజయవాడ మధ్య రైళ్ళ రాకపోకలు నిలిపివేయక తప్పలేదు. భువనేశ్వర్-సికింద్రాబాద్

No comments:
Post a Comment