Menu bar





Thursday, November 7, 2013

సుప్రీంలో సమైక్యవాదుల అలజడి!

             రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపడానికి అనేక మంది చట్టం, న్యాయాల సాయాన్ని తీసుకొంటున్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మాట చెల్లుబాటు కాకుండా చూడటానికి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమలు కాకుండా చూడటానికి అనేక మంది సుప్రీం కోర్టు ఆశ్రయిస్తున్నారు. ఇప్పటి వరకూ సుప్రీంలో ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా లెక్కకు మించి పిటిషన్లు పడినట్టు తెలుస్తోంది. రాజకీయ నాయకులు, ముఖ్య రాజ్యాంగ నిపుణులు వేసే పిటిషన్లకు మాత్రమే పత్రికల్లో కవరేజీ వస్తోంది. అయితే సామాన్యులు, ఇతరులు వేసే పిటిషన్లు కూడా చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ఈ పిటిషనర్ల ఆశ అంతా.. రాజ్యాంగం మీదే! ఆంధ్ర్రపదేశ్ ఏర్పాటు సమయంలో రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ ను అడ్డుపెట్టుకొని విభజన నను ఆపాలని వీరంతా భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర్ర ప్రదశ్ విభజనకు బిల్లు రూపొందిస్తే.. దాన్ని పార్లమెంటు వరకూ తీసుకు వస్తే రాజ్యాంగం ప్రకారం ఆ బిల్లు చెల్లదని కో ర్టు ద్వారా చెప్పించాలని పిటిషనర్లు తాపత్రయపడుతున్నారు. బిల్లు పాస్ అవ్వాలంటే రాజ్యాంగ సవరణ అవసరం అని స్పష్టం చేయించాలని భావిస్తున్నారు. అలా రాష్ట్ర విభజన ప్రక్రియ వచ్చే శీతాకాల సమావేశాల సమయంలో ఆగిపోతే.. 2014 తర్వాత ముందడుగు పడే అవకాశాలే లేవని భావిస్తున్నారు. అయితే ఇదంతా ఆశాభావ దక్పథం మాత్రమే. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఏదైనా మాయ చేసి బిల్లును ముందుకు తీసుకెళ్లి.. విభజన ప్రక్రియను పూర్తి చేస్తే ఆ తర్వాత ఎవరు చేయగలిగింది ఏమీ ఉండదు. ప్రస్తుతానికి అయితే సుప్రీం స్థాయిలో సమైక్యవాదుల హడావుడి ఎక్కువగా ఉంది. మరి వారు ఈ విషయంలో గెలుస్తారో, గల్లంతవుతారో వేచి చూడాలి!

No comments:

Post a Comment