Menu bar





Saturday, September 28, 2013

బీజేపీ ఆత్మ విమర్శ చేసుకోవాలి: సుష్మా స్వరాజ్ వాస్తవాలు గుర్తించాలి!

బీజేపీ ఆత్మ విమర్శ చేసుకోవాలి: సుష్మా స్వరాజ్ వాస్తవాలు గుర్తించాలి!


తెలంగాణా విభజన ఎందుకు? ఈ ప్రశ్నకు బీజేపీ సూటిగా సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు! తమ పార్టీ సిద్ధాంతాలకి, ప్రస్తుతం నడుస్తున్న విభజన ఉద్యమానికీ సంబంధమే లేదన్న వాస్తవం బీజేపెకి తెలుసు! అయితే వెనక్కు రాలేని చిక్కుల చట్రంలో ఇరుక్కు పోయిన బీజేపీ మొహమాటంగానే ఉద్యమంలో కొనసాగుతోంది.

>> చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సాధనాలు అని తెలంగాణా పాట ఎత్తుకున్న బీజేపీ - సీమాంధ్ర ప్రాంతం ఎట్లా పరిపాలనా సౌలభ్యం ఉన్న రాష్ట్రమో తేల్చి చెప్పాలి.

>> తెలంగాణా ప్రాంతం మిగతా రాష్ట్రం కన్నా అభివృద్ధిలో ముందున్నదని శ్రీ కృష్ణ కమిటీ తేల్చి చెప్పిన తర్వాత కూడా - తెలంగాణా విభజన ఉద్యమం అర్థం లేని ఉద్యమమని బీజేపీ చెప్పలేక పోతోంది.

>> సీమాంధ్ర ప్రజల నుంచి తమ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పాపులర్ డిమాండ్ లేక పోయినా - విడిపోతేనే మీకు లాభమని బీజేపీ ఎట్లా చెబుతుంది?

>> తెలంగాణా విభజన - అభివృద్ధి, ఆర్థిక వ్యత్యాసాల ఉద్యమం కాదని, చిన్న రాష్ట్రాల ఉద్యమం కాదని తెలంగాణా జేఏసీ ప్రకటిస్తుంటే, అదే జేఎసీలో బీజేపీ ఎట్లా కొనసాగుతోంది?

>> రెండు ప్రాంతాల మధ్య భాషా పరమైన, సంస్కృతీ పరమైన వైరుధ్యాలు ఉన్నాయని, తెలంగాణా ప్రత్యేక జాతి అనీ తెరాసా, తెలంగాణా జేఏసీ ప్రకటిస్తుంటే ... బీజేపీ ఆ సిద్ధాంతాలను ఎట్లా సమర్థిస్తోంది?

>> రెండు ప్రాంతాల మధ్య విద్వేషా విష ప్రచారాన్ని తెరాస, తెలంగాణా జేఏసీ ఉద్దేశ పూర్వకంగా కొనసాగిస్తుంటే బీజేపీ కూడా దానికి ఎట్లా వంత పాడుతోంది?

ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ - తెలంగాణా జనతా పార్టీగానే మారిపోయింది - భారతీయ జనతా పార్టీ కి సంబంధించిన రంగు, రుచి, వాసనా ఏవీ అందులో మిగిలి లేవు. జాతీయ నాయకత్వం కూడా -" ఇక్కడ పోయేదీ లేదు - వచ్చేదీ లేదు" అన్న పద్ధతిలో 'కిషన్ అండ్ కో తెలంగాణా కూటమి' ఇష్టా ఇష్టాలకే పార్టీని అప్పగించేసింది.

అయినా కూడా సుష్మా స్వరాజ్ వచ్చి తెలంగాణా ఒక పవిత్ర పోరాటం అని అందరినీ నమ్మించాలని చూస్తోంది. తెలంగాణా విభజన విషయంలో ఆ పార్టీ సిద్ధాంత నిబద్ధత, చిత్తశుద్ధి రెండిటినీ గాలికి వదిలేసింది.
 

No comments:

Post a Comment