Menu bar





Thursday, September 26, 2013

 తొందరపడి ఒక కోయాల ముందే కూసింది ... అన్నట్లుగా కొద్ది మంది రాష్ట్ర విభజన విషయం పరిశీలించాలంటూ సుప్రీం కోర్ట్, హై కోర్టులను ఆశ్రయించారు.

అయ్యా! అసలు కథ ప్రభుత్వ పరిధిలోకి రానే లేదు, అది ఎట్లాంటి నిర్ణయం చేయనే లేదు, ఎందుకంత తొందర? జరిగింది ఒక రాజకీయ పార్టీ నిర్ణయం మాత్రమె ... అట్లాంటి విషయాలలో ఏదో జరుగుతుందని ముందే ఊహించి కోర్టులు విచారణ చెయ్యవు, అని కోర్టులు తెలియ చేసాయి.

కాదా మరి! ఊహలన్నీ నిజం అవుతాయా! రాజకీయ పార్టీలు - ప్రైవేట్ సంస్థలు - వంద కతలు చెబుతాయి; అవన్నీ చేసేయ్యడానికే కాదు! తెదేపా గతంలో వెయ్యి సార్లు మనసు మార్చుకొంది; కాంగ్రెస్ పార్టీ గతంలో లక్ష సార్లు మడమ తిప్పింది; సీపీఐ ఎన్నో విప్లవ ఘోషణలను చారిత్రిక తప్పిదాలుగా ఒప్పుకొంది.

రాష్ట్ర సమగ్రతకు దివ్యమైన రాజ్యంగ రక్షణ ఉంది. విభజన వాదులు రాజ్యాంగ భగ్నం కోరుతున్నారు; రాజ్యాంగం పక్కన పెట్టి బ్రూట్ రాజకీయ నిర్ణయం కోరుతున్నారు. దాని డిమాండులోనే అరాచకం ఉంది. అది నెరవేరదు.

No comments:

Post a Comment