ఆంద్ర విభజన అసోంలో చిచ్చు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అసోంలో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా
మారింది. 2014 వరకు తెలంగాణా ఏర్పాటు తీసి పెట్టమని అసోం ముఖ్యమంత్రి
తరుణ్ గోగోయ్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. . ప్రత్యేక తెలంగాణ
ప్రకటన వల్ల అసోంలో విభజన వాదం ఊపందుకుందని ఆయన ఆవేదన వ్యక్తం
చేస్తున్నాడు. ఇటీవల ఢిల్లీలో ఏర్పాటు చేసిన జాతీయ భద్రతా మండలి (ఎన్ఐసీ)
సమావేశానికి హాజరయిన ఆయన మాట్లాడుతూ అసోం మూడు రాష్ట్రాలుగా విభజించాలని
ఆందోళనలు చెలరేగాయని చెప్పాడు.
ఆర్బి ఆంగ్లాంగ్, బోడోల్యాండ్,
కామతాపూర్‌గా - 3 ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరిగిందని -
దానికి తెలంగాణా విభజనకు ఆదిష్టానం అంగీకరించడమే కారణమంట. మిగతా
రాష్ట్రాలలో ఇట్లాంటి డిమాండ్లు మరో 20 - 22 దాకా ఉన్నాయని cwcకి తెలుసు.
అయితే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చాలా తేలికగా ఐపోతుందని భావించింది.
సమైక్య ఉద్యమం ఇంతలా ఎగసిపడుతుందని ఊహించ లేదు!
కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ విధానం లేకుండా - ఇట్లా తెలంగాణా విషయంలో - కేవలం రాజకేయ లబ్ది కోసమే తెగించడం దారుణం.
No comments:
Post a Comment