Menu bar





Thursday, October 3, 2013

1. తెలంగాణ బిల్లు, 2. ఉమ్మడి రాజధాని 10 ఏళ్లు, 3. జల పంపిణీపై....

ఇప్పటివరకూ సీమాంధ్ర కేంద్రమంత్రులు చెపుతున్నట్లు బిల్లు ఒక్క అడుగు కూడా కదల్లేదన్నది అవాస్తవమనీ, అది ఎన్నో మైళ్ల దూరం నడిచేసి పార్లమెంటు ఆమోదానికి మరో కొద్ది అడుగుల దూరంలోనే ఉన్నదని తేలిపోయింది. గురువారంనాడు కేంద్ర మంత్రిమండలి ముందుకు టి. నోట్ టేబుల్ అంశంగా వచ్చింది.

తెలంగాణ నోట్ లో ప్రధానంగా మూడు అంశాలున్నాయి. అందులో 1. 10 జిల్లాల(హైదరాబాదుతో సహా)తో సహా తెలంగాణ, 2. 10 ఏళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, 3. వనరుల పంపిణీకై ఉపసంఘం... ఇంకా ఎన్నో ఉన్నాయి. మొత్తమ్మీద సీమాంధ్ర ప్రజలు ఎంత మొత్తుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ తాను ఏమనుకుంటున్నదో అదే చేస్తున్నట్లు కనిపిస్తోంది.

టి.నోట్ పై తాను ఎప్పుడో సంతకం చేశాననీ, కేంద్రమంత్రి మండలి చూడటం ఒక్కటే ఇక మిగిలి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే ఇక తెలంగాణ ఏర్పాటు ఎంతో దూరంలో లేదని తేలిపోతోంది. కానీ సమైక్య రాష్ట్రం కోసం ప్రజలు, ఉద్యోగులు రోడ్లెక్కి గత రెండు నెలలకు పైగా ఉద్యమం చేస్తున్నా... కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. వెరసి కేంద్రం సీమాంధ్ర ఉద్యమాన్ని చూస్తూనే తెలంగాణకు సై అంటున్నట్లు కనబడుతోంది.

No comments:

Post a Comment