Menu bar





Thursday, October 3, 2013

టి నోట్‌పై కాంగ్రెస్‌ ఎందుకింత వేగంగా అడుగులు వేస్తోంది?

తెలంగాణ నోట్‌ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకింతగా ఆరాటం పడుతోంది, వేగంగా అడుగులు వేస్తోందన్న అంశంపై అనేక రకాలైన సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసి 60 రోజులు గడిచిపోయింది. అప్పటి నుంచి ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. టీ నోట్ జాప్యానికి కారణాలేవైనా.. తమ ఒత్తిడి వల్లే నోట్ ఆగిందన్న అభిప్రాయాన్ని సీమాంధ్ర నేతలు ప్రముఖంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు.

దీంతో తెలంగాణవాదుల్లో అనుమానాలు పొడచూపాయి. అక్టోబర్ 15వ తేదీలోపు తెలంగాణ నోట్ ఆమోదించకపోతే కాంగ్రెస్‌ను అనుమానించాల్సి వస్తుందని తెలంగాణ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్డీయేతో పొత్తులు పెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులోభాగంగా ఢిల్లీ సదస్సు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో ఆయన అంతర్గత చర్చలు కూడా జరిపారు. ఈ పొత్తు ఖరారైనపక్షంలో టి బిల్లుకు బీజేపీ మద్దతు అందకుండా పోయే ప్రమాదం ఉంది. మరోవైపు.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలి కాంగ్రెస్ పెద్దలకు ఏమాత్రం నచ్చడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా జాప్యం చేస్తే తాము ఆశించిన రాజకీయ ప్రయోజనాలు దక్కకుండా పోయే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన హైకమాండ్‌ను వెంటాడుతోంది. వీటన్నింటిని క్యాచ్ చేసుకునేందుకు వీలుగా టి నోట్‌ ఫైలును దుమ్ము దులిపేందుకు కాంగ్రెస్ పెద్దలు సిద్ధమయ్యారు. పనిలో పనిగా సీమాంధ్ర మంత్రులను తన దారికి తెచ్చుకునే పనిలో కాంగ్రెస్ పెద్దలు నడుంబిగించారు. అదేసమయంలో టి ఫైలును వేగంగా కదిలించాలని నిర్ణయించారు. ఈనెల 9వ తేదీ నుంచి ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈలోపే టి ఫైలుకు ఒక క్లారిటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం నడుం బిగించింది. ఇందులోభాగంగానే వడివడిగా అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment