సమైక్య ఉద్యమం మరో స్వాతంత్ర్య ఉద్యమం. వీరోచితంగా పోరాడదాం!
గత 66 రోజులుగా గాంధేయ మార్గంలో ఉద్యమం నడిపాం! గాంధేయ మార్గం అంటే హింస లేకుండా ఉద్యమమని అర్థం, అంతే! గాంధీజీ ఉద్యమాలకు ఆర్థిక, రాజకీయ లక్ష్యం ఉండేది. ఒక కార్యక్రమం చేపడితే, అది బ్రిటిష్ పాలకులను గడగడలాడించేది.
కానీ, మనం చేసిన ఉద్యమానికి ప్రతిస్పందనే లేకుండా పోయింది. కాబట్టి, ఒకసారి మన ఉద్యమాన్ని సింహావవలోకనం చేసుకొని, కొత్త వ్యూహాలతో ముందుకు సాగాలి! సమైక్య రాష్ట్రం అన్నదొక్కటే మన నినాదం, లక్ష్యం. మధ్యలో లాభనష్టాలు, బేరసారాల లెక్కల గురించి కొందరు నయబోధ చేస్తుంటారు. అన్నీ చూసుకుందాం, ముందు - విభజన నిర్ణయం పక్కన పెట్టి రండి, అన్నదే మన పంథా!
గాంధీ మార్గం నుంచి అనం అల్లూరి మార్గానికి మళ్ళాలి. అట్లాగని అల్లూరి మార్గం గాంధీ మార్గానికి భిన్నమైనది కాదు - గాంధీ మార్గానికి స్థానిక వ్యూహం చేర్చడమే అల్లూరి మార్గం. అంటే, ఇకపై మన ఉద్యమంలో చొరవ, సాహసం, సూటిదనం, ఎత్తుగడ, ఉద్యమ పద్ధతులలో విప్లవ పంథా చేర్చాలి.
మనం ఏ కార్యక్రమ తీసుకున్నా అందులో ఒక వ్యూహం ఉండాలి. ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ముందస్తు ప్రణాళిక ఉండాలి. మంచి బృందం ఉండాలి. చేసిన యోజనను పకడ్బందీగా అమలు చెయ్యాలి.
ఉద్యమ కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ద్వంసం చెయ్యగూడదు. అయితే, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఉద్యమాలు చెయ్యవచ్చు. ప్రజలను అసౌకర్యానికి గురి చెయ్యకూడదు!
అల్లూరి స్ఫూర్తి ఏమిటి? అల్లూరి రాబిన్ హుడ్ క్రూసో కాదు; అల్లూరి జనంలో మనిషి; జన సామాన్యం అంతటినీ స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఆకర్షించాడు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్టాలను చూసి చలించిపోయాడు. ఆ జన హృదయం మనకూ కావాలి.
సమైక్య ఉద్యమం మరో స్వాతంత్ర్య ఉద్యమం. స్వాతంత్ర్యం అనే పదం ఉపయోగించడం సముచితమనే అనుకుంటున్నాను. మరి, స్వాతంత్ర్యం ఎవ్వరి నుంచి కావాలి! ఎవరికి మనం బానిసలుగా ఉన్నాం! ఇక్కడ స్వాతంత్ర్యం కావలసింది - పాలకులనుంచి కాదు; ఇతర సమాజాల, వర్గాల నుంచి కాదు. స్వాతంత్ర్యం కావలసింది - పరిపాలనలో దాపుడుతనం నుంచి! పరిపాలకుల ప్రజా వ్యతిరేక కార్యకలాపాల నుంచి స్వాతంత్ర్యం కావాలి.
మనం రాష్ట్ర ఐక్యత గురించి పోరాడుతున్నం. అంటే, జాతీయ సమగ్రత గురించిన పోరాటం ఇది. మనం ప్రజల మధ్య రేకెత్తించిన కృత్రిమ విబేధాలను రూపుమాపాలని అనుకుంటున్నాం. ఆ విధంగా మనం జాతీయ సమైక్యతా దూతలం కూడా! అత్యంత విద్వేషతో కూడిన ఉద్యమాలను మనం చూశాం. అత్యంత ప్రేమైక భావనతో కూడిన ఉద్యమాలను మనం నడిపి చూపాలి. ఉద్యమాలను ఉత్తేజం కలిగించవచ్చు; కానీ, ఉన్మాదాన్ని, ఉగ్రవాదాన్ని మనం ప్రోత్సహించం.
సమైక్య ఉద్యమం తెలుగు జాతిని సుద్రుడం చేసే మహా ఉద్యమం కావాలి!
>> విభజన వాదులను, వాళ్ళ తాబేదారులను విమర్శించడం మానేయండి
>> బూతుల బుంగ వాదనల జోలికి వెళ్ళవద్దు. వాళ్ళ విమర్శనలను పట్టించుకోవద్దు.
>> బహిరంగ కార్యక్రమాలలో ఎక్కడో ఒక చోటా మమేకమై పనిచెయ్యాలి.
>> మన బంధుమిత్రులను ఉద్యమంలోకి తీసుకు రావాలి.
>> ఉద్యమ సాహిత్యాన్ని సక్రమగా వినియోగించాలి.
>> ఉద్యమకారుల మధ్య విభేదాలోస్తే, సామరస్యంగా పరిష్కరించుకొని సత్వరమే అందరూ రంగంలోకి దూకాలి.

No comments:
Post a Comment