Menu bar





Saturday, October 5, 2013

సమైక్య ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన నేతలారా! జాతి మిమ్మల్ని క్షమించదు!

సమైక్య ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన నేతలారా! జాతి మిమ్మల్ని క్షమించదు!


కేబినేట్ మీటింగ్ ఒక మోసం - అని చిన్న పిల్లాడికి కూడా తెలుసు! కేబినెట్లో మీరేమీ పీకేది లేదని మీ ఇద్దరికీ కూడా తెలుసు! కేబినేట్ మీటింగ్ లో రాష్ట్ర విభజన ప్రధాన విషయమనీ మీకు తెలుసు. కానీ మీరు సమైక్య వాదుల ఆశలన్నీ కూల్చేశారు. అవమానం పాలు చేశారు. ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించారు.

రాష్ట్ర విభజనకు చెందిన అత్యంత ముఖ్యమైన అంశాన్ని - టేబుల్ నోట్ గా - హడావిడిగా ప్రవేశ పెట్టినప్పుడే - సోనియా కుట్ర బట్టబయలయింది. సోనియాకు రాత్రే చేరిన విభజన నోట్ - మీ కెందుకు షిండే పంపలేదు? పంప లేదే పో! గంట ముందే పంపిస్తే ... తక్షణం తిప్పి కొట్టకుండా - ఎగేసుకొని కేబినేట్ మీటింగుకి ఎందుకు పొయ్యారు. వెళ్ళారే పో! వెళ్ళే ముందు - రాష్ట్ర సమైక్యత కోరుకుంటున్న ప్రజల పట్ల, అందుకోసం జరుగుతున్న ఉద్యమం పట్ల - మీకు నిబద్ధత లేదా? ఒక వ్యూహంతో ఆ మీటింగుకి వెళ్ళాలి కదా?

ఎవరితో సంప్రదించారు? కనీసం ముఖ్య మంత్రితో మాట్లాడారా? ఎంపీల బృందంతో మాట్లాడారా? ఉద్యమ నేతలతో మాట్లాడార? ఎవ్వరితో సంప్రదించకుండా - కుట్ర బుద్ధితోనే మీరు కేబినేట్ సమావేశానికి వెళ్ళారని ప్రజలు భావిస్తున్నారు. మీకు దుర్మార్గం చెయ్యాలని మనస్సులో లేకపోతే, మీకు రాష్ట్ర సమైక్యత పట్ల నిజంగా నిబద్ధతే ఉంటే, సోనియా కుట్రను తిప్పికొట్టే వాళ్ళు! కుతంత్ర బుద్ధితో ఏర్పాటు చేసిన అ సమావేశాన్ని బహిష్కరించి ఉండేవాళ్ళు. అప్పుడు యావత్ ప్రపంచం సోనియా కుట్ర గుర్తించి ఉండేది. మీరు ప్రజల దృష్టిలో హీరోలయ్యే వాళ్ళు.

కానీ మీరు - ఒక రంగస్థల నాటకంలో మీ పాత్రను ఆడి వచ్చారు. నామ మాత్రంగా కేబినేట్ నోటుని వ్యతిరేకిస్తున్నామని గ్లిజరిన్ కన్నీళ్లు పెట్టుకొని వచ్చారు. కేబినేట్ నోటుకు ప్రాధాన్యం కల్పించారు. ఆ విధంగా సమైక్య ఉద్యమంపై శూలం గుచ్చారు. దొంగ రాజీనామాలు సమర్పించి ఇంకా ప్రజలను మోసగించాలని చూస్తున్నారు.

చాలు చాలిక! ఈ వేషాలు కట్టిబెట్టండి. అన్ని రకాల పదవులకు, ఎంపీ సభ్యత్వానికి వెంటనే రాజీనామా ఇచ్చి ఆమోదింప చేసుకొని ప్రజా ఉద్యమానికి తక్షణమే సరెండర్ కండి. లేకపోతే, ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.

No comments:

Post a Comment