Menu bar





Wednesday, October 16, 2013

సీమాంధ్ర దేశంలో అతి పేద రాష్ట్రంగా నిలుస్తుందా?

                   ఇన్ని రోజులూ టాప్ స్టాండర్డ్స్ లో ఉన్న "ఏపీ'' సీమాంధ్ర రూపంలో చివరాఖరుకు పడిపోతుందా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు.
                  ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోవడం.. అంటే సీమాంధ్ర ప్రజలకు ఒక శిక్షలాంటిదేనని.. అక్కడి జనాభాకు, ఆర్థిక వనరులకు చాలా వ్యత్యాసం ఉంటుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా దుర్మార్గంగా తయారవుతుందని..  హైదరాబాద్ లాంటి ఆర్థిక వనరు దూరం అవ్వడం సీమాంధ్ర ప్రభుత్వానికి కష్టాలను, కడగండ్లను మిగులుస్తుందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలదే ముఖ్య వాటా అని.. ఇప్పుడు ఈ రెండు జిల్లాలూ దూరం అవ్వడంతో.. సీమాంధ్ర ఖజానాకు కాసులు వచ్చే అవకాశాలే ఉండవని వారు అంటున్నారు. 
                ఇదిచాలాదన్నట్టుగా వచ్చే పదేళ్లో కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఏ స్థాయిలో ఇస్తుందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు! గత చరిత్రను పరిశీలిస్తే.. ఇంత వరకూ ఏర్పాటు చేసిన రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతుందని.. కేంద్రం వద్ద కూడా డబ్బు లేదని.. నిధుల విడుదలలో జాప్యం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలా ఏ విధంగా చూసినా.. కొత్త రూపు సంతరించుకోనున్న  సీమాంధ్రకు ఆర్థిక విషయాల్లో అంతులేని కష్టాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment