Menu bar





Wednesday, October 16, 2013

పక్కా తెలంగాణలో పత్తాకోల్పోయిన కేసిఆర్

                   పక్కా ప్యూర్ తెలంగాణలో కేసిఆర్ పత్తా కోల్పోయాడు అంటున్నారు, ఈ వార్త ఇప్పడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. తెలంగాణ వాదం అత్యదికంగా ఉన్నదే ఉత్తరతెలంగాణలోని నాలుగుజిల్లాలో. అటువంటి ఉత్తర తెలంగాణలో టిఆర్ఎస్ పరిస్థితి దాదాపు జీరో లెవల్ వచ్చిందంటున్నారు. ఒక వరంగల్ జిల్లా మినహా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో కేసిఆర్ పార్టీ టిఆర్ఎస్ పరిస్తితి ఘోరంగా తయారైంది అంటున్నారు.
              కరీంనగర్ లో కాస్తా బలం తగ్గింది కాని ఇంకా పూర్తిగా టిఆర్ఎస్ దెబ్బ తినలేదని, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం దాదాపు జీరో అయింది అంటున్నారు. ఈ విషయాన్ని ఇంటలిజెన్స్ వర్గాలే పేర్కొనడంతో దీనికి బలం చేకూరుతోంది. పైగా ఇది నమ్మడానికి అవకాశాలు కూడా ఎక్కువే. ఎందుకంటే...
బిజేపి తెలంగాణకు అనుకూలమని కుండబద్దలు కొట్టి చెప్పడం, కేసిఆర్ వైఖరి ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ముందునుంచి బిజేపి బలం ఉంది. మహబూబ్ నగర్ లో ఉప ఎన్నికల్లో బిజేపి గెలిచి అక్కడ సత్తా చాటుకుంది. ఇక జిల్లా రాజకీయాల్లోనే తిరుగులేని నేతగా పేరున్న నాగం జనార్దన్ రెడ్డి బిజేపి లో చేరడంతో ఇక్కడ బిజేపి మరింత పుంజుకుంది. పైగా మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తెలంగాణ వాదం బలంగా ఉన్నప్పుడు కూడా టిఆర్ఎస్ హవా తక్కువనే.
                 ఈ మూడు జిల్లాల్లో టిడిపిదే పైచేయి. అయితే చంద్రబాబు తన వైఖరితో తెలంగాణ ప్రజల్లో విలన్ గా మారడంతో ఈ జిల్లాలో ఉన్న బలమైన తెలుగుదేశం నేతలంతా బిజేపి వైపు చూస్తున్నారట. పైగా తెలంగాణ వచ్చాక కేసిఆర్ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తాడు అన్న వార్తలు టిఆర్ఎస్ పరిస్థితిని మరింత దిగజార్చాయి. కాంగ్రెస్ నేతలు బలంగా ఉన్న తెలంగాణ ప్రాంతాల్లో  ఉన్న టిఆర్ఎస్ నేతలు ఇక మనపని ఖతమే అంటూ వారు కూడా బిజేపి వైపు  చూస్తున్నారని సమాచారం. దీంతో తెలంగాణలో టిఆర్ఎస్ పరిస్తితి పత్తాలేకుండా పోతోంది అన్నదానికి బలం చేకూరుతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

No comments:

Post a Comment