Menu bar





Wednesday, October 16, 2013

అయ్యబాబోయ్.... సీమాంద్ర కాంగ్రెస్ అసలు బాగోతమిదా!

                           అయ్యబాబోయ్... సీమాంద్ర కాంగ్రెస్ అసలు బాగోతమిదా... అంటూ సీమాంద్ర జనం అవాక్కవుతున్నారు. ఇన్నాళ్లు టిడిపి, వైఎస్సార్ సిపి వంటి పార్టీ నేతలతో పాటు కొన్ని జేఏసిలు సైతం సీమాంద్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుగానే సోనియాతో ఒప్పందం కుదుర్చుకుని, విభజనకు అంగీకరించిన తర్వాతే రాష్ట్ర విభజన నిర్ణయం వెలుబడిందని గొంతు బొంగురుపోయేలా మొత్తుకున్న సంగతి తెలిసిందే. అయితే వారంతా గిట్టక అలా ఆరోపిస్తున్నారని, సీమాంద్ర కాంగ్రెసోళ్లంతా సమైక్యం కోసం నిజంగా కష్టపడుతున్నా కూడా పెద్దలు ఒప్పుకోవడం లేదేమో అనుకున్నారు.
                                        కాని ఇప్పుడు ఒక్కొక్కరు కేంద్రమంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు కూడా బయటకు వచ్చి అసలు బాగోతం బయటపెట్టేసుకుంటుండంతో అయ్యబాబోయ్ వీరి అసలు బాగోతమిదా... అంటూ గుండెలు బాదుకుంటున్నారు సమైక్యవాదులు. తాజాగా విభజన ఆగదు, ఇక సీమాంద్రకు రావాల్సిన ప్యాకేజిపైనే పోరాడాలి అంటూ వారంత కొత్త రాగం అందుకోవడంతో ఏముంది, అంతా అయిపోయింది, ఇక మాకింత కావాలి అని అడుక్కోవడమే మిగిలింది అన్నట్టే కదా.. అని అంటున్నారు పరిశీలకులు కూడా.
                     నిన్నటికి నిన్న కేంద్రమంత్రి పల్లంరాజు విభజన అయిపోయింది అన్నాడు, అయినా సరే చివరివరకు ప్రయత్నిస్తానని, సీమాంద్రులకు దక్కాల్సింది దక్కేలా చూస్తానన్నారు. ఒక రోజు తేడాతో మరో  కేంద్రమంత్రి పురంధరీశ్వరి నోరు తెరచింది. ఆమె ఇదే విషయాన్ని నొక్కి వక్కానించింది, విభజన అయిపోయింది, పంపకాలే మిగిలాయి అన్న రీతిలో మాట్లాడి పంబరేపింది. ఇక రాజీనామాలు చేసామని కొందరంటే, తాము చేసినా విభజన ఆగుతుందా అంటూ ఏకంగా కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వంటి వారే సెలవిస్తున్నారు. ఇంకా వారి పార్టీకే చెందిన విజయవాడ ఎంపీ లగడపాటి కాంగ్రెస్ ఎవరితో కుమ్ముక్కయిందో బయటపెడతా, ఒక్క సారి నా రాజీనామా ఆమోదించనీయండి అంటున్నారు. ఇలా వారి మాటలన్నీ విన్నాక అందరు దొంగలే, కాని బయట పడకుండా ఉండేందుకు నానా వేశాలు వేస్తున్నారని, అందరికి అన్ని తెలిసే విభజన జరిగింది, ఎవరికి దక్కాల్సినవి వారికి దక్కినట్టే, అందుకే ఎవరెంత మొత్తుకుంటున్నా సరే సోనియా తెలంగాణ ఏర్పాటుకు ముందుకే పోతోందన్న విషయం ఇప్పటికి అర్థమయిపోయింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

No comments:

Post a Comment