Menu bar





Sunday, November 3, 2013

అసెంబ్లీకి బిల్లు వస్తే ... ఢిల్లీ సుల్తానుల కళ్ళే తెరిపించేలా చారిత్రక పోరాటం జరగాలి!


కేంద్రం - రాష్ట్ర విచ్చిన్నానికి అన్ని సన్నాహాలు చేస్తోంది; అనేక రకాల ఆటంకాలు వచ్చే అవకాశం కనబడుతున్నా, కేంద్రం రాష్ట్ర విభజనకు మొండిగా ముందుకు పోవడానికి కారణం - సీమకు, కోస్తాకు చెందిన మంత్రుల లొంగుబాటే. కేబినెట్లో ఉన్న ముగ్గురు మంత్రులు ... మరోసారి ద్రోహం చెయ్యడానికి - ఢిల్లీలో పడిగాపులు పడుతున్నారు. .ముసాయదా బిల్లుపై సంతకాలు పెట్టి ... మరోసారి వంచన చెయ్యబోతున్నారు! (కేబినేట్ సమావేశాలు బహిష్కరించాలని కావూరి, పల్లం రాజు, కిషోర్ చంద్ర దేవులపై ఒత్తిడి తేవాలి!

ఇప్పుడు మనముందు ఉన్న అవకాశాలు:


1. ఢిల్లీలో ప్రదర్శనల ద్వారా ఒత్తిడి తీసుకు రావడం;
2. వివిధ జాతీయ, ప్రాంతీయ పక్షాలకు వాస్తవాలు తెలియజేసి పార్లమెంటులో వ్యతిరేక వాతావరణం సృష్టించడం;
3. సమస్యను సరైన కోణంలో జాతీయ మీడియా దృష్టికి తీసుకు వెళ్ళడం;
4. రాష్ట్రపతి ధర్మబద్ధంగా వ్యవహరించేలా ప్రయత్నించడం;
5. కేబినేట్ సమావేశాలు బహిష్కరించేలా మన మంత్రులపై ఒత్తిడి తేవడం;
6. అసెంబ్లీకి బిల్లు వచ్చినప్పుడు - మెజారిటీ సభ్యులు వ్యతిరేకంగా వోటు వేసేలా చూడటం;
7. అసెంబ్లీలో విభజన వాదాన్ని వాస్తవాల ఆధారంగా ఎండగట్టడం;
8. అసెంబ్లీలో అభిప్రాయాలను క్రోడీకరించి - సభ ఆభిప్రాయాన్ని - రాష్ట్రపతి ముందుపెట్టడం;
9. బిల్లు పార్లమెంటులో పెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తే - ఉద్యోగులు మెరుపు సమ్మె చెయ్యాలి. జనజీవనం స్తంభించాలి.
10. ఈ లోపు బిల్లుకు వ్యతిరేకంగా - న్యాయస్థానాలలో - వివిధ కోణాలలో పోరాటం ప్రారంభం కావాలి;
11. చివరిగా పార్లమెంటు సమావేశాలలో ప్రభుత్వం పడిపొయ్యేలా రాజకీయ ఒత్తిడి తీసుకు రావడం;

సమైక్య ఉద్యమం విద్వేషం ఆధారంగా ముందుకు పోలేదు; తీవ్రవాదంతో నేర పూరితమైన ఒత్తిడి తీసుకు రాలేము; తీవ్రవాదమే విభజనకు కొమ్ము కాచిన తరుణం ఇది; ఈ పరిస్థితులలో, రాజ్యాంగ ప్రక్రియను కాలరాచి, నిరంకుశ పూరితంగా రాష్ట్ర విభజనకు కేంద్ర తెగిస్తోంది. ఈ నేపథ్యంలో - రాజ్యంగ పరమైన అంశాలను ముందుకు తెచ్చి విభజనను అడ్డుకోవడం - పూర్తిగా న్యాయ సమ్మతమే. ఇది కేవలం - సాంకేతికమైన అంశమే - అని కొందరు మేధావులు తీసిపారేయవచ్చు గాక!

కానీ, ధర్మ సూక్ష్మం - సూక్ష్మంగానే ఉంటుంది; కీలక సమయంలో అదే పరమ ఆధారం అవుతుంది; మహాశక్తిమంతం అవుతుంది. సూదిమోపినంత స్థలం ఇచ్చినా - పాండవులు - తిరిగి ధర్మ రాజ్యం స్థాపించగలరని భావించబట్టే, దుర్యోధనుడు అందుకు ససేమిరా అన్నాడు. 371-డి అట్లాంటి 'సూదిమొన' వంటి అంశమే కావచ్చు - కానీ దాని మహాత్మ్యం, గొప్పతనం - దేశకాలమాన పరిస్థితులనుబట్టి రూపొందుతుంది. రాజకీయం ప్రజాస్వామిక మర్యాదలను అతిక్రమించినప్పుడు ...ప్రజలు న్యాయపీఠాన్ని ఆశ్రయించక తప్పదు. పాలకులు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నప్పుడు - అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోక తప్పదు.

అసెంబ్లీ అభిప్రాయం మహత్తరం:

శాసన సభ, విధాన సభ - రెండూ కూడా రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన సంస్థలు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన సంస్థలు. ఈ రాష్ట్రానికి సంబంధించి - అసెంబ్లీలకు బయట పార్టీల అభిప్రాయాలకు కట్టుబాటు విలువ లేదు! అసెంబ్లీ లోపల చెప్పే మాటలకే అట్లాంటి విలువ ఉంటుంది. లేఖల ఆధారంగా రాష్ట్ర విభజన చేస్తున్నామని చెబుతున్న కేంద్రం - రాజ్యాంగ బద్ధ సంస్థ ఉమ్మడి అభిప్రాయానికి విలువ ఇవ్వకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు; సభ తిరస్కరించినా బిల్లుకు ఆమోదం తెలుపుతానని రాష్ట్రపతి చెప్ప కూడదు! నిజానికి రాష్ట్రపతి బిల్లును శాసన సభకు పంపనే కూడదు! సరైన ప్రాతిపదిక లేని రాష్ట్ర విభజన మంచిది కాదని బిల్లును తిప్పి పంపాలి.

ఒకవేళ బిల్లు పంపినా - అస్మ్బ్లీ అభిప్రాయానికి రాష్ట్రపతి తప్పనిసరిగా విలువ ఇచ్చి తీరాలి. ఎందుకంటే - అసెంబ్;ఈ తీర్మానం ఒకవిధంగా - ఏర్పడబోయే ఒక రాష్ట్రం యావత్తు ఒకే తాటిపై నిలబడి - తమని ప్రత్యేక రాష్ట్రంగా విడదీయవద్దని - నిర్ణయించి చెప్పడమే అది!

ఇంతవరకు భారత దేశ చరిత్రలో ఇట్లాంటి సన్నివేశం రాలేదు! కోరుకున్న వాళ్లకు రాష్ట్రాలు ఇవ్వని పరిస్థితి ఉంది కానీ, వద్దన్న వాళ్ళను బలవంతంగా చీల్చి, తన్ని తరిమి వేసే సందర్భం రాలేదు! ప్రపంచంలోనే వచ్చి ఉండదు! సొంత రాష్ట్రం కావాలని ఉద్యమాలు ఉండవచ్చు కానీ, ఇతరులను పంపించి వెయ్యండి అనే ఉద్యమాలు ఎక్కడా ఉండవు! ఇది EXPULSION - తరిమివేత మాత్రమే! ఘోరమైన అవమానం మాత్రమే! సమాఖ్య వ్యవస్థకు ప్రాధాన్యం ఉన్న భారత దేశంలో - ఒక రాష్ట్రాన్ని - వెలివేసినట్లుగా ఏర్పరుస్తారా? నేరస్తులు, దోషులు అన్న ముద్రతో ఈ ప్రజానీకాన్ని విభజించి దూరంగా నేరస్తులు, దోషులు అన్న ముద్రతో ఈ ప్రజానీకాన్ని విభజించి దూరంగా విసిరేస్తారా? ఇది జాతీయ సమగ్రతకు చాలా చేటుగా పరిణమిస్తుంది. ఈ దుర్మార్గాన్ని ప్రభుత్వం ఆపాలి! అది తెగించినా రాష్ట్రపతి విజ్ఞత చూపాలి!

రాష్ట్ర విచ్చిత్తి ఒక సమస్యకు అంతం కాదు ఆరంభం మాత్రమే! రాష్ట్ర విభజన గర్భంలో - దేశంలో ఎక్కడా ఎరుగని ఆరాచక పరిస్థితులు ఏర్పడి - జనం పెద్ద ఎత్తున వలసలు పోవలసిన దాగి ఉంది. Mass Genesode అనివార్యం అవుతుంది.. ఇన్నాళ్ళూ పెంచిపోషించిన విద్వేషం, విష ప్రచారం దారుణమైన సంఘ వ్యతిరేక కార్యకలాపాలుగా రూపుదాల్చే ప్రమాదం ఉంది. కొన్ని తరాలపాటుగా కోట్లాది జనం - తమ జీవితాలలో సంక్షోభం ఎదుర్కోవలసి వస్తుంది. జిల్లాల మధ్య నదీ జలాల వివాదాలు పెచ్చరిల్లడం ఖాయం! ఇన్ని అమానుష పరిణామాలకు దారి తీసే ఈ విభజన ఒక రాజకీయ అత్యాచార పర్వం తప్ప వేరొకటి కాదు!

అసెంబ్లీకి బిల్లే కనుక వస్తే - ( వచ్చే అవకాశాలు చాలా తక్కువే ) - సభ లోపల, బయట కూడా ప్రజాగ్రహం వెల్లువెత్తాలి. ఢిల్లీ సుల్తానుల కళ్ళే తెరిపించేలా చారిత్రక పోరాటం జరగాలి! అందుకు ఇప్పటినుంచే మానసికంగా సంసిద్దులమవుదాం!

No comments:

Post a Comment