Menu bar





Sunday, November 3, 2013

ఏంచెప్తాం?: బొత్స బాణంపై జగన్ నో, బాబు డైలమా

              ఈ నెల 5వ తేదీలోపు మంత్రుల బృందం(జివోఎం) విధివిధానాల పైన నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాత అఖిల పక్షం ఉంటుందన్న కేంద్ర హోంమంత్రి లేఖల పైన రాష్ట్రంలోని పలు పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అఖిల పక్షానికి వెళ్లడం వృథా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తుంటే, అనవసరమైన వెళ్తామని తెరాస భావిస్తోంది. బిజెపి వంటి పార్టీలు దీనిని స్వాగతిస్తున్నాయి. మరోసారి అఖిల పక్షం ఏర్పాటు చేయాలని పిసిసి చీఫ్ బొత్స అధిష్టానానికి లేఖ రాశారు. ఆయన వదిలిన బాణం టిడిపి వంటి పార్టీలను ఇరకాటంలో పడేసింది. అదే సమయంలో బాబు కూడా అఖిల పక్షానికి డిమాండ్ చేశారు. అయితే ఆయా పార్టీలు జివోఎంకు చెప్పాల్సిన దాని పైన, అఖిల పక్షంలో ఏం చెప్పాలనే దాని పైన నివేదికలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. ఏం చెబుతామనే చర్చ పార్టీలలో జోరుగా సాగుతోంది. ప్రాంతాల వారీగా సూచనలు, సలహాలు తీసుకొని.. రెండింటిని కలిపి ఒకే నివేదికగా పొందుపర్చి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పంపించే అవకాశముంది. సీమాంధ్ర నేతల్లో ఎక్కువ మంది విభజన తప్పని స్థితిలో మంచి ప్యాకేజీ కోరాని డిమాండ్ చేస్తున్నారు. 

        కేంద్ర హోంశాఖ లేఖ పైన టిడిపిలో తీవ్ర తర్జన భర్జన సాగుతోంది. ఒకటి రెండు రోజుల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. అయితే అఖిల పక్షానికి టిడిపి గైర్హాజరయ్యే అవకాశాలున్నాయి. జివోఎంకు పంపే నివేదిక పైన చర్చించనున్నారు. అఖిల పక్షాన్ని బిజెపి స్వాగతిస్తోంది. తెలంగాణను కోరుతూనే సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ బిజెపి నివేదికలో కోరే అవకాశముంది. విభజన నిర్ణయం జరిగిన నేపథ్యంలో అఖిల పక్షానికి వెళ్లవద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుంది. అయితే రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కలవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అఖిల పక్ష సమావేశం అనవసరమని తెరాస భావిస్తోంది. అయితే ఈ సమావేశం విభజన తర్వాత వచ్చే సమస్యల పైన కావడంతో తెలంగాణ ప్రాంతానికి ఏమేం కావాలో తెరాస డిమాండ్ చేయనుంది. ఇందుకోసం జివోఎంకు ఓ నివేదిక పంపనుంది. అఖిల పక్షం ఏర్పాటు చేస్తే పార్టీ అధినేత కెసిఆర్ స్వయంగా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇక సమైక్యవాదం వినిపిస్తున్న సిపిఎం, విభజన అంటున్న సిపిఐ వంటి పార్టీలు ఎవరి వాదన వారు వినిపిస్తూ రెండో ప్రాంతానికి న్యాయం చేయాలని కోరే అవకాశముంది.

No comments:

Post a Comment