తెలంగాణపై కేబినెట్ నోట్ పది రోజుల్లో అసెంబ్లీకి వచ్చే అవకాశాలు
కనిపిస్తున్నాయి. గురువారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కేబినెట్
భేటీ జరిగింది. ఇందులో తెలంగాణ నోట్ పై వాడిగావేడిగా చర్చ సాగింది. ఈ
నేపథ్యంలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి
సూచించి నోట్‌ను పంపించే అవకాశాలున్నాయి.
తెలంగాణ నోట్ పైన అసెంబ్లీలో కేవలం చర్చ మాత్రమే జరిగి, ఓటింగ్ జరిగే
అవకాశం లేదని తెలుస్తోంది. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజనకు కాంగ్రెసు
పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీలో
మంత్రులు కావూరి సాంబశివ రావు, పల్లం రాజులు నోట్‌ను వ్యతిరేకించారు.
గంటన్నరపాటు హాట్ హాట్‌గా చర్చ సాగింది. అనంతరం నోట్‌ను ఆమోదించింది.
No comments:
Post a Comment