Menu bar





Tuesday, October 15, 2013

సమైక్యవాదినే కానీ సంతకం పెట్టను!

బొత్స సత్తిబాబు మామూలు సూపర్ కాదు. సూపర్ కే సూపర్. ఆయన తిమ్మిని బమ్మిని.. బమ్మిని.. తిమ్మిని చేయటంలో ఆయనకు మించినోళ్లు హోల్ ఆంధ్రప్రదేశ్ లోనే దొరకరు. సీమాంధ్రలో అంత పెద్ద ఉద్యమం జరుగుతున్నాఅదరని.. బెదరని ఏకైక ఆయన ఖ్యాతి విశ్వవ్యాప్తి అయ్యింది. ఆయన గొప్పతనాన్ని గుర్తించిన సొంత జిల్లా వాసులు కడుపు మండి మాటల నుంచి చేతల వరకు వెళ్లారు.
అలాంటి సమయంలో ఏ రాజకీయ నాయకుడైనా ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. అలా చేస్తే ఆయన బొత్స సత్తిబాబు ఎందుకవుతారు. ఎందుకు అనవసరంగా ఆస్తులు ధ్వంసం చేస్తారు. చేస్తే..చేశారు కానీ వాళ్ల మీద కేసులు పెట్టొద్దు.. కనీసం లాఠీ కూడా ఎత్తొద్దని టీవీల్లో అదే పనిగా చెప్పారు. అదేం చిత్రమో.. ఆయన ఆ మాట అన్న తర్వాత నుంచి దొరికినోళ్లను దొరికినట్లుగా పోలీసులు కుమ్మేశారు. కొంతమంది అమాయులు కూడా పోలీసుల దాష్ఠీకానికి బలైపోయారు.అలాంటి మనిషిలో మరో కోణం ఉంది. పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వెళ్లి వెంకన్నను దర్శించుకొని బయటకు వచ్చిన ఆయన.. రాష్ర్టం సమైక్యంగా ఉండాలని తాను కోరుకున్నట్లు చెప్పారు. సామాన్యుడు కోరితే ఆ స్వామి వింటారో లేదో కానీ.. సత్తిబాబు అడిగిన కొద్దీ రోజులకే తెలంగాణ రాష్ట్ర ప్రకటనే సోనియమ్మ చేయించేసింది. ఇంతకీ ఆయన తిరుమల వెంకన్నను ఏం అడిగారన్నది ఇప్పటికీ పెద్ద మిస్టరీగా మారింది.
పుట్టిన రోజు సైతం తాను మరో వందేళ్లు ఆరోగ్యంగా జీవించాలనో.. ఇంకా పెద్దపెద్ద పదవుల్లోకి వెళ్లాలనో కోరుకోకుండా పిచ్చ జనం కోరుకుంటున్నట్లు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకోవటం ఉంది చూశారు.. సమీప భవిష్యత్తులో ఇంతటి విశాల మనసు ఉన్న నేత తెలుగువాళ్లకు దొరకటం కష్టమే. అంతటి కరుడుగట్టిన సమైక్యవాదిని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు వెళ్లి.. ‘‘సార్, మేం రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకున్నాం. పీసీసీ అధ్యక్షుని హోదాలో విభజనకు వ్యతిరేకమని ఒక్క సంతకం పెట్టండి’’ అంటే.. ఒక్క నవ్వు తాను సమైక్యవాదినేనని.. గతంలో పార్టీకి ఇచ్చిన లేఖలో సంతకం పెట్టాను కాబట్టి మరోసారి సంతకం పెట్టటం కుదరదని తేల్చి చెప్పారు. సత్తిబాబు ఎంత హుషారో చూశారా.

No comments:

Post a Comment