Menu bar





Tuesday, October 15, 2013

అయ్యబాబోయ్... సమైక్య షాక్

అయ్యబాబోయ్... సమైక్య షాక్ అంటున్నారు, దాని విలువెంతో తెలిసాకా అందరు పని నోళ్లు వెల్లబెట్టడం తప్ప ఇప్పుడేం చేయలేని పరిస్థితి. కాంగ్రెస్ కేవలం తన రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న పనికి రెండు నెలల్లోనే జరిగిన నష్టం విలవ లక్ష, రెండు లక్షలో కాదు ఏకంగా 4 వేల కోట్లు. ఇది కూడా కేవలం ఉద్యోగులు చేసిన సమ్మె వల్లనే జరిగింది. అంటే ప్రైవేటు రంగంలో ఎంత లేదన్నా మరో 4 వేల కోట్లయితే ఉంటుందని అంచనా.
అంటే ఇప్పటి వరకు జరిగిన నష్టం దాదాపు ఎనిమిది వేల కోట్లన్నమాట. ఇది ఆగిందా.. అంటే అదీ లేదు, ఆర్టీసి, విద్యుత్ శాఖల వల్లే జరిగే నష్టం నివారించబడినా రాష్ట్రానికి అత్యధికంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సయిజ్, వాణిజ్య పన్నులతో పాటు మరెన్నో శాఖలకు సంబందించిన నష్టం జరుగుతూనే ఉంది. అంటే ఇది ఏ స్తాయికి చేరుకుంటుందో చెప్పలేని పరిస్థితి. అసలే ఆర్థికంగా కుదేలయిన ఆంద్రప్రదేశ్ ఇంత నష్టాన్ని పూడ్చుకుంటుందా, లేక ఇది ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలపై పడి చివరకు ప్రజలే బలవుతారా... అంటే నిపుణులు మాత్రం ప్రజలే అంటున్నారు.
ఇప్పటి వరకు వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం 500 కోట్లు, రవాణా, మోటారు, వాహనాల పన్ను వంటి వాటి ద్వారా వచ్చే ఆదాయం 210 కోట్లు, ఎక్సయిజ్ ద్వారా వచ్చేది 380 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 350 కోట్ల నష్టం  జరిగింది. అలాగే గనులు, భూగర్భవనరులు ద్వారా వచ్చే ఆదాయం 150 కోట్లు, పన్నేతర ఆదాయం 193 కోట్ల నష్టం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా ఈ అనిస్చితికి తెరదించకుండా కేంద్రం చోద్యం చూస్తుండడం, హైకమాండ్ పెద్దలు రోజుకో తీరు మాట మారుస్తూ ఇంకా ఈ ఉద్యమాన్ని రెచ్చగొడుతుండడం దారుణం.

No comments:

Post a Comment