Menu bar





Wednesday, October 16, 2013

కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ సీమ, ఆంధ్రుల మధ్య చిచ్చు..!

                    ఇద్దరు కలిసి కట్టుగా ఉంటే వారిని ఓడించడం,దెబ్బతీయడం అంత సులభం కాదు.. అందుకే ముందుగా వారిని రెండుగా విడదీసి.. తర్వాత ఓడించు..అనేది బ్రిటీషు వాడు చెప్పిన రాజకీయ నీతి. భారతదేశంలో పాగా వేయడానికి బ్రిటిషర్లు  ఈ నీతినే ఫాలో అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఇదే దిక్సూచి అవుతోంది. తమకు రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత పరిస్థితులు కనిపిస్తున్న సీమాంధ్ర ప్రాంతాన్ని.. సమైక్యాంధ్ర అంటూ ఏకతాటిపై నిలబడుతున్న ఆ ప్రాంతాన్ని విడదీయడానికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ రంగం సిద్ధం చేస్తోంది. 
ఈ విషయంలో వారు 'రాజధాని' అంశాన్ని అస్త్రంగా చేసుకొన్నారు. ఇక విభజనపై వెనక్కు తగ్గమని స్పష్టం చేసిన కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు రాజధాని అనే ఫుట్ బాల్ ను ఇచ్చి తన్నుకొమ్మని సీమాంధ్ర నేతలకు అదేశించే అవకాశాలున్నాయి. తాజాగా కేంద్ర హోం మంత్రి షిండే వ్యాఖ్యల్నీ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారని విలేకరులు అడిగితే కేంద్ర హోం మంత్రి షిండే సమాదానం చెబుతూ అది ఆ ప్రాంత ప్రజలు, నేతలు నిర్ణయించుకోవాల్సిన విషయమని అన్నారు.
                      ఇది చాలు సీమాంధ్ర నేతల మధ్య విభేదాలు మొదలవ్వడానికి.. కాంగ్రెస్ అధిష్టానం అనుచరులు ఉండనే ఉన్నారు. వారు రాజధాని మా ప్రాంతంలో ఉండాలి.. అంటే మా ప్రాంతంలో ఉండాలి..అంటూ వాదన మొదలుపెట్టే అవకాశాలున్నాయి. వారితో పాటు ప్రజలు కూడా డైవర్ట్ అవతారు. అప్పుడు సీమాంధ్రలోసమైక్యాంధ్ర ఉద్యమం కాకుండా. .రాజధాని ఉద్యమం మొదలువుతుంది! కాంగ్రెస్ హైకమాండ్ సేఫ్ జోన్ లోకి వెళుతుంది. విభజన గురించి వ్యతిరేకత తగ్గుతుంది.. రాజాధానిని ఏర్పాటు చేయడమో లేక.. సీమాంధ్రను మళ్లీ రెండు ముక్కలు చేయడమో.. చేస్తారు! విభజించు పాలించు సిద్ధాంతం కాంగ్రెస్ ను సేఫ్ జోన్ లోకి నెట్టేలా ఉంది!

No comments:

Post a Comment