Menu bar





Tuesday, October 15, 2013

డేంజర్ న్యూస్ : ఉద్యోగుల స్థానంలో ఉద్యమంలోకి విధ్యార్థులు!

                    సమైక్య ఉద్యమం ఇక కొత్త పుంతలు తొక్కపోతోందా... ఏ కారణంగా ఉపాద్యాయులను సమ్మె విరమించుకునేలా చేసారో అది నిష్పలం కానుందా... అంటే నిజమేనన్న డేంజర్ సంకేతాలు విజయవాడ నుంచి జారీ అయ్యాయి. శుక్రవారం విజయవాడలో సమావేశమైన విద్యాసంస్థల ఐకాస ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సమైక్య ఉద్యమాన్ని విద్యార్థుల చేతుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. విద్యార్థులు రంగంలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవడం కష్టమే, ఇది ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో ఉద్యమాల్లో చూసాం.
                           అందుకే ఇది డేంజర న్యూసే అంటున్నారు. అయితే సమైక్య ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా సమ్మె విరమించి ఉద్యమం నుంచి తప్పుకుంటున్న సూచనలు కనిపిస్తుండడంతో ఈ నిర్ణయం వెలుబడ్డట్టు భావిస్తున్నారు పరిశీలకులు. విద్యార్థుల ఉద్యమానికి ప్రజలు, ప్రజాసంఘాల మద్దతును కూడ గడుతామని కూడా విద్యాసంస్థల జేఏసి స్పష్టం చేసింది.
                           అంటే రాజకీయ నాయకులను, పార్టీలను సమైక్య ఉద్యమంలోకి రానించేందుకు సీమాంధ్రలో ప్రజలు, సమైక్యవాదులు సిద్దంగా లేరన్న సంకేతాలు కూడా ఈ నిర్ణయం జారీచేసినట్లయిందంటున్నారు.  అంటే సమైక్య రాష్ట్రం కోసం జగన్, చంద్రబాబు వంటి వారు ఆమరణ దీక్షలు చేస్తూ ఉద్యమబాట పట్టి సీమాంధ్ర ప్రజల్లో హీరోలు కావాలని కంటున్న కలలు కూడా వేస్టే అన్న సూచనలు కూడా ఈ నిర్ణయం జారీ చేసింది. ఇదెలా ఉన్నా ఉద్యమాల పేరుతో విద్యార్థుల చదువులు పాడు చేయవద్దు, వారి భవిష్యత్తును బుగ్గిపాలు చేయవద్దు, విద్యాసంస్థలకు ఉద్యమం నుంచి మినహాయింపు ఇవ్వాలి, ఉపాద్యాయులు సమ్మె విరమించాలి అని మేధావులు, నిపుణులు, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్ని వృధాకాబోతున్నాయన్న వాదన, సంకేతాలు మాత్రం విద్యాసంస్థల జేఏసి నిర్ణయం డిక్లేర్ చేసింది.

No comments:

Post a Comment