Menu bar





Tuesday, October 15, 2013

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తేనే "తెలంగాణ''!

    
        వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి గెలిపిస్తేనే తెలంగాణ ప్రక్రియ పూర్తి అవుతుందా? లేకపోతే తెలంగాణ విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందా? రాష్ట్ర విభజన ప్రక్రియకు ఎన్నికలు ప్రధాన అడ్డంకి కాబోతున్నాయా? ప్రస్తుత పరిస్థితుల్లో కలుగుతున్న అనుమానాలివి. కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతోంది.. అన్న వార్తల నేపథ్యంలో ఈ అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే ఈ విషయంలో కాంగ్రెస్ గేమ్ ప్లాన్ కూడా ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 
         రాష్ట్ర విభజనతో సీమాంధ్రలోకాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతోంది.. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఈ విషయంపై అవగాహన ఉంది. మరి తెలంగాణ ఏర్పాటు వల్ల ఇక్కడ క్లీన్ స్వీప్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువ సీట్లను దక్కించుకొనే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొనే అవకాశాలున్నాయి. అందులో ముఖ్యమైనది ఎన్నికల ముందే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించకపోవడం, ఈ ప్రక్రియను పెండింగ్ లోనే పెట్టి ఎన్నికలకు వెళ్లడం.
తద్వారా తెలంగాణలోనూ, అటు సీమాంధ్రలోనూ పరువు దక్కించుకోవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఆశిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత నేతలు ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నారు. దీని వల్ల ఇక్కడ అన్నో ఇన్నోసీట్లు దక్కే అవకాశాలున్నాయి. ఇక సీమాంధ్ర నేతలకు జనాల్లోకి వెళ్లే ధైర్యం లేదు. మరి వారికి దాన్ని అందించాలంటే.. తెలంగాణ ప్రక్రియ నెమ్మదించాలి. ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజనను పూర్తి చేస్తే.. అందుకు పర్యవసనాలను ఎన్నికల్లోనే ఎదుర్కోవాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే తెలంగాణ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. సీమాంధ్ర నాయకులకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇక తెలంగాణలో ఇప్పటికే తెలంగాణ ప్రకటించామని.. వచ్చే ఎన్నికల్లో మాకే అధికారం ఇస్తే తెలంగాణ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇస్తుంది. ఇది కాంగ్రెస్ గేమ్ ప్లాన్.

No comments:

Post a Comment