Menu bar





Tuesday, October 15, 2013

పళ్లికిలించిన పల్లంరాజు!

         కేంద్ర మంత్రి పల్లంరాజు పళ్లికిలించారు, దీంతో ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్న సామెతనే నేడు ఎందుకు పుట్టాను అని సిగ్గుపడే పరిస్థితిని కల్పించాడు. విభజనను ఆపుతాం, అందుకే మేము పదవుల్లో కొనసాగుతున్నాం అంటూ వారిని ఎన్నుకున్న ప్రజలు తిట్లు, శాపనార్థాలు, చివరకు హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా మాకు పరువు కన్నా పదవే ముఖ్యం అన్నారు కొన్నాళ్లు. చివరకు వారు చెప్పిన సాకు...
 ‘రాష్ట్ర విభజనను ఆపుతాం’ అన్నది అయ్యేలా లేకపోవడంతో ఇక ప్రజలు పారిపోయినా సరే పట్టుకుని తంతారు అనుకున్నారేమో తప్పని సరి పరిస్థితిలో రాజీనామాలు చేసారు.

               అయినా పదవిపై చేవ చావక పదవిలో ఉంటూనే ఇప్పుడు మళ్లీ పళ్లికిలించడం చూస్తుంటే వారిని ఎన్నుకున్న ప్రజల గుండెలు మండుతున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాజాగా ఆయన మళ్లీ కేంద్రమంత్రి హోదాలోనే ఢిల్లీలో తిరుగుతున్నారు. తాజాగా ఆయనకు సమైక్య సెగ తాకింది, అసలే సమైక్యం కోసం రాజీనామా చేసానన్న ధీమాలో ఉన్నాడాయే, ఊరుకుంటాడా, వెంటనే చక్కటి సమాధానం చెప్పి తాను సమైక్యమే, తెలాంగాణాను అడ్డుకోవడానికే రాజీనామా చేసాం అంటాడనుకున్నారు, అయితే ఆయన సమాధానం విని ముక్కున వేలేసుకోవడం అందరి వంతయింది.
           ఆ సమాధానమేంటంటే అవును నేను రాజీనామా చేసాను కదా, ప్రధానికి రాజీనామా లేఖ ఇచ్చాను, అది ఆమోదించాలా.. వద్దా అన్నది ప్రధాని చేతిలో ఉంది అన్నాడు. అప్పడు అర్థమయింది ఆయన రాజీనామా వెనుక దాగి ఉన్న అసలు బాగోతం. సరే ఇంతకీ రాష్ట్రం పరిస్తితి ఏంటి అంటే ఏముంది.... తెలంగాణ ఏర్పాటు ఆగేలా లేదు, విభజన ప్రక్రియపై కాంగ్రెస్ వెనుకడుగు వేసే పరిస్థితులు లేవు అని చెప్పి అందరిని హతాషులను చేసాడు పల్లంరాజు. ఏదైతే ఆపుతాం, అది మారాజీనామాలతో సాద్యం అన్నారో, వారిలో ఒకరే ఇలా అసలు విషయం చెప్పాక ఇక సమైక్యంపై ఆశతో అన్ని త్యాగం చేసి పోరాడుతున్న వారి పరిస్థితి మాటేమిటి!

No comments:

Post a Comment