Menu bar





Thursday, October 17, 2013

ఇదీ సమస్య!, సమావేశపర్చండి: టిపై గవర్నర్‌తో జగన్

హైదరాబాద్: అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి, సమైక్య తీర్మానం పెట్టేలా చూడాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర నేతలతో కలిసి జగన్ గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా జగన్ విభజన ద్వారా వచ్చే సమస్యలను గవర్నర్‌కు వివరించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన అంశంపై కేబినెట్ నోట్‌కు ఆమోద ముద్ర పడకముందే అసెంబ్లీని తక్షణం సమావేశపర్చి సమైక్యం కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇందుకు సంబంధించి ఓ వినతి పత్రాన్ని కూడా గవర్నర్‌కు ఇచ్చారు.

                విభజనతో అనేక సమస్యలు వస్తాయని, రాష్ట్ర రాజధాని హైదరాబాదును అందరు కలిసి అభివృద్ధి చేశారని, ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికే అది పోతే సీమాంధ్రలో ఉద్యోగ సమస్యలు వస్తాయని, నీటి సమస్యలు తలెత్తుతాయని గవర్నర్‌కు వివరించారు.

No comments:

Post a Comment