Menu bar





Thursday, October 17, 2013

కిరణ్‌తో చర్చలు ఫలప్రదం : ఏపీఎన్జీవోల సమ్మె విరమణ

             
                   రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు చేపట్టిన చారిత్మాత్మక సమ్మె గురువారం సాయంత్రంతో ముగిసింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఏపీఎన్జీవోలు జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఈ సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పి. అశోక్ బాబు వెల్లడించారు.

                  ఇదే అంశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమ్మెను విరమించాలని సీఎం తమను కోరారని చెప్పారు. ఆయన తమ సమస్యలు అర్థం చేసుకున్నారని, తన పరిధి మేరకు హామీ ఇవ్వగలనని చెప్పారని వెల్లడించారు.

               తాను పూర్తిగా సమైక్యవాదినే అని సీఎం స్పష్టం చేశారని అశోక్ బాబు తెలిపారు. అసెంబ్లీకి తీర్మానం వస్తే తాము మరలా సమ్మె బాట పడతామని సీఎంతో చెప్పగా.. ఆ అవసరం ఉండబోదని అన్నట్టు అశోక్ బాబు చెప్పారు. అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించేందుకే ప్రయత్నిస్తామని సీఎం స్పష్టం చేశారని ఆయన చెప్పారు.

                  అంతకుముందు ఏపీఎన్జీవోలతో జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణ తెలిపారు. దీంతో గురువారం అర్థరాత్రి నుంచే ఉద్యోగులు విధుల్లోకి హాజరవుతామని అశోక్ బాబు వెల్లడించారు. ఈ సమ్మెను తాత్కాలికంగానే విరమిస్తున్నట్టు తెలిపారు.

No comments:

Post a Comment