Menu bar





Tuesday, October 15, 2013

వారంతా కొత్త రాజధాని కాంట్రాక్టుల వేటలో ఉన్నారు!

                   కాంట్రాక్టుల ద్వారా ఆర్థికంగా లబ్ది పొందుదామనే ఆలోచనతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారని ఢిల్లీ సమాచారం.

                  ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నేతలు సమైక్య ఉద్యమాన్ని పక్కనబెట్టి కొత్తగా ఏర్పడనున్న రాష్ట్రానికి రాజధానిని ఎక్కడ నిర్మించనుంది అనే అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం. కొత్త రాజధాని కాంట్రాక్టుల కోసం ఇప్పటి నుంచే పైరవీలు చేస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. తాము గతంలో చేపట్టిన భారీ ప్రాజెక్టులు వాటికి సంబంధించిన వివరాలను ఇప్పటికే సంబంధిత పెద్దలకు సమర్పించి కొత్త కాంట్రాక్టులు అడుగుతున్నారట.

                 ముఖ్యంగా వేల కోట్ల రూపాయల విలువ చేసే విమానాశ్రయం, నౌకాశ్రయం, ఓడ రేవులు, జాతీయ రహదారులు, రోడ్డు, సాగునీటి పథకాలు వంటి ఇతరత్రా కాసుల వర్షం కురిపించే భారీ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీలోని పెద్దలను కలుస్తున్నట్లు సమాచారం. అంతేకాదు... కొత్త రాజధానిని ఎక్కడ పెట్టాలనే విషయంలోనూ వీరంతా ఎవరివారు పైరవీలు చేసుకుంటున్నారు. ఇక అధిష్టానం కూడా.. వీరి పట్ల అధిష్టానం అనుకూలంగానే ఉందట. సమైక్యవాదాన్ని పక్కనపెడితే.. మీకు కోరింది ఇస్తామని హామీ ఇస్తోందట!

No comments:

Post a Comment