Menu bar





Tuesday, October 15, 2013

రాష్ట్రాన్ని సమైక్యం చేసిన పైలిన్ తూఫాన్!-

                        హమ్మయ్యా... ఎంతో భయపెట్టిన పైలిన్ తూఫాన్ రాష్ట్రాన్ని సమైక్యం చేసింది  అంటున్నారు. అది రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని భయపడిపోయిన ఏపికి అది దసరాసంబరాలను మిగిల్చిందన్న భావం అందరిలో వ్వక్తమవుతోంది. కారణం ఇన్నాళ్లు విడిపోయి కొట్టుకుంటున్న వారిని పైలిన్ తూఫాన్ ఏకం చేసింది. ప్రజాప్రతినిధులు, మంత్రులు కనిపిస్తే చాలు తరిమికొడుతున్న సీమాంద్ర జనం చేత వారు నమస్కారాలు పెట్టించుకునేలా చేసింది అంటున్నారు.
                          అత్యవసర పరిస్థితుల్లో అందరు ఐక్యంగా ఉండాలి, కాదు ఉంటాము అన్న దానిని కూడా ఈ తూఫాన్ రుజువు చేసిందంటున్నారు. తెలంగాణ, సీమాంద్ర అని కాకుండా విపత్తునుంచి ప్రజలను ఆదుకునేందుకు మంత్రులంతా అక్కడ రంగంలోకి దిగారు. ఇక రఘువీరా రెడ్డి అయితే బాదిత ప్రాంతాలను రాత్రిపగలు పర్యవేక్షిస్తూ రెవెన్యూ యంత్రాంగాన్ని వారికి అండగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
                          ఇక తెలంగాణకు చెందిన మంత్రులు కూడా తూఫాన్ బాదిత ప్రాంతాలలో వారి శాఖల ద్వారా ప్రజలకు సహాయం అందించడంలో బిజీ అయ్యారు. వారితో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కలిసి ప్రజల చెంతకు వెల్లి వారి కష్టసుఖాలను, ఇబ్బందులను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ, సురక్షిత ప్రాంతాలకు వారిని చేరవేస్తూ బిజీగా మారిపోయారు. జనాలు కూడా అన్ని మరచిపోయి సారు అంటూ దండం పెడుతూ వారి కష్టాలను విన్నించుకుంటున్నారు. ఇలా తూఫాన్ ప్రజలను, ప్రజాప్రతినిధులను ఏకం చేసింది.
అంతే కాదు సమైక్యం అంటూ ఉద్యోగాలు మాని సమ్మెలోకి దిగి ఉద్యమం చేస్తున్న ఉద్యోగులను విధుల్లోకి చేర్చింది తూఫాన్. దీంతో ఉద్యోగుల సేవలు లేక స్థంబించని కార్యకలాపాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు దూరమయ్యాయి. జీతాలు లేక అవస్తలు పడుతున్న కుటుంబాలు కూడా జీతాలు తీసుకుని అసలసిసలైన పండగ వేల వారి ఇంట్లో ఆనందాన్ని నింపుకున్నారు. ఇక తూఫాన్ ఎంతో భీభత్సం సృష్టిస్తోందనుకుంటే అందరిని కలిపి అది కాస్తా బలహీన పడి ఊహించినంత కష్టం, నష్టం కలిగించకుండా వెల్లిపోయింది. ఇదండీ కొట్టుకుంటున్న తెలుగువారందరని కలిపేసిన పైలిన్ తూఫాన్ సంగతి.

No comments:

Post a Comment