Menu bar





Tuesday, October 15, 2013

ఫ్లాష్ న్యూస్ : త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఔట్ – తెలంగాణ డౌట్

             ఫ్లాష్ న్యూస్.... త్వరలోనే కేంద్రప్రభుత్వం మైనార్టీలో పడనుంది, ప్రభుత్వం గద్దె దిగనుంది. ఈ మాటలు ఏకంగా కేంద్రమంత్రి, యూపిఏ లో కీలక భాగస్వామి అయిన శరద్ పవార్ తెలిపారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే కేంద్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందని, ఎన్నికలు తెలంగాణ ఏర్పాటుకు ముందుగానే వస్తాయని చెప్పారు. దీంతో ఇది రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
            తన రాజీనామా ఆమోదం కోసం లగడపాటి రాజగోపాల్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ రాజీనామాను స్పీకర్ సోమవారం ఆమోదించనుందని శరద్ పవార్ మాట. దీంతో రాజీనామాలు చేసిన మిగతా ఎంపీలవి కూడా  ఆమోదించాల్సి వస్తుంది, అంతే కాదు అవి ఆమోదించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారట. ఇదే జరిగితే కేంద్రంలో యూపిఏ సర్కారు మైనార్టీలో పడిపోతుంది. పలితంగా ముందస్తు ఎన్నికలకు వెల్లాల్సిందే అంటున్నాడు శరద్ పవార్.
            పైగా అత్యంత సంక్లిష్టంగా మారిన తెలంగాణ సమస్యను తప్పించుకోవాలన్నా, దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నా ఇదే సరైందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందట. అందుకే తెలంగాణ ఏర్పాటు కోసం వడివడిగా అడుగులు వేస్తోంది, ఈ దశలో దానికి నిరసనగా సీమాంద్రకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు రాజీనామాలు చేస్తారు, ఇప్పటికే దాదాపు మొత్తం మంది చేసారు, మిగిలిన వారు చేస్తారు, లగడపాటి రాజీనామా సాకు చూపి అందరివి తప్పనిసరిగా ఆమోదించాల్సి వస్తుంది.
            దీంతో సర్కారు మైనార్టీలో పడిపోయి ఇక ఎన్నికలకు వెల్లాల్సి వచ్చిందని, ఎన్నికలయ్యాక తెలంగాణ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికలను ఎదుర్కుంటుంది. దీంతో ఏపిలో తమ విభజన నిర్ణయం  ఎంత వరకు పనిచేసింది, జగన్, చంద్రబాబు, కేసిఆర్ ల అసలు సంగతేంటి, వారి బలం ఎంతో కూడా తెలుస్తుంది, దానిని బట్టి తెలంగాణపై ముందుకు పోవచ్చు, అదృష్టం బాగాలేక కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఇక చిక్కే ఉండదనుకోండి. అయితే ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట, పరిణామాలు ఎలా ఉంటాయి, ఏం జరుగుతుంది అనేది ఎదిరిచూడాలి.

No comments:

Post a Comment