తెలంగాణా విడిపోతే ఎవరికీ లాభం?
తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే గొప్ప మార్పు ఏదో సంభవిస్తుందని అందరినీ ఆశల పల్లకీ ఎక్కిస్తున్నారు. అట్లాంటి - వాగ్దానాలన్నీ - నిజంగా నెరవేరాలంటే, ఈ కింది సందర్భాలన్నీ సాకారం కావాలి:
>> విభజన వాదులంతా ఒకే వేదికను అలంకరించడం కాడు; అన్ని పార్టీలను రద్దు చేసి, ఒకే తెలంగాణా పార్టీ ఏర్పడాలి.
>> ఎవరికివారు విడివిడిగా కలల ప్రపంచాలు చూపించడం కాదు; అందరూ కలసి - ఒకే మేనిఫెస్టో ప్రకటించాలి.
>> పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు - ఇట్లాంటి వాళ్ళు ఎవరూ ఎన్నికలలో నిల్చోకూడదు! దోపిడీకి, అవినీతికి అవకాశం ఇవ్వకూడదు.
>> ఉన్నత కులాల వాళ్ళెవరూ రాజకీయ పదవులలోకి కానీ, ఎమ్మెల్యేలుగా కానీ, ఏమ్పీలుగా కానీ నిల్చోడానికి వీలు లేదు; అవసరమైతే, అట్లాంటి వాళ్ళకి రిజర్వేషన్ పెట్టాలి!
>> ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాలనుంచి వచ్చే కంపెనీలకు 80 శాతం ఉద్యోగాలు తరతరాల తెలంగాణా వాళ్ళకే ఇవ్వాలని శాసనం చెయ్యాలి.
పైన చెప్పినవన్నీ సాధ్యం కాకపొతే, సమైక్య ఆంధ్రకు , తెలంగానాంధ్రకు తేడా ఏమీ ఉండదు. ఏతావాతా వచ్చే తేడా ఏమంటే -
ఆట అదే ఉంటుంది; పాత్రలే మారతాయి! అదే దోపిడీ, అదే అవినీతి, అదే విచక్షణ, అదే వివక్ష ఉంటాయి. పేదరికం అట్లాగే ఉంటుంది. సామాజిక అంతరాలు అట్లానే ఉంటాయి.
జరగవలసింది అవినీతి మీద, దోపిడీ మీద పోరాటం. సామాజిక అంతరాల మీద, పేదరికం మీద పోరాటం. ఈ వాస్తవం గ్రహించారు కనుకనే - మహబూబ్ నగర్ నుంచి అనేకమంది - తెలంగాణా వాదులం, సమైక్యాంధ్ర వాదులం అంటూ కర్నూల్ జన సునామీ సభలో పాల్గొన్నారు. వాళ్లకివే జేజేలు!

No comments:
Post a Comment