ఇక్కడ పుట్టడమే నేరమా?
స్వార్ద రాజకీయాలకు, కుటిల నీతికి తెలుగు నెల రెండు ముక్కలై పోయింది. తెలుగు జాతి చితికి పోయింది.
ఆనాడు మద్రాస్ నుండి ఆంధ్రగా విడిపోయినప్పుడు కుడా ఇవే స్వార్ద రాజకీయ శక్తులు తమ స్వలాభం కొరకు సిమాంద్ర ప్రజల ప్రయోజనాలను పణం పెట్టారు. కాంగ్రెస్ కుటిల రాజకీయ ఎత్తు గడలతో ముందు కర్నూలు ను రాజధానిగా చేసి తరువాత హైదరాబాద్ కు తరలించారు. ఒకవేళ ఆనాడే ఆంద్ర రాజధాని విజయవాడ లో ఉంటె అసలు విశాలాంధ్ర ఉహే వచ్చేదికాదు. ఆ తరువాత జై తెలంగాణ , జై ఆంద్ర ఉద్యమాలలో కుడా ఇలాంటి స్వార్ద రాజకీయాలే పనిచేశాయి. మరల గత దశాబ్దం నుండి జరిగిన రాజకీయలు పరాకాష్ట కు చేరుకొని ఈ నాటి ఈ దుస్థితికి చేరుకొంది.
ఆనాడు కాకతీయ సామ్రాజ్యం విచ్చిన్నమైంది . విజయనగర సామ్రాజ్యం కకావికలం అయింది . నిజాం చేతిలోచిక్కిన తెలుగు నెల ఇంగ్లీషు వాడికి అమ్ముడు పోయింది. అయినా మరల తెలుగు జాతి బతికి బట్ట కట్టింది.
కాకతీయుల పతనం తరువాత ఆత్మాభిమానం తో ఓరుగల్లు వదలి హంపి చేరారు. హంపి పతనం తో పెనుగొండ కు ఆ తరువాత మదురై , చెన్నపట్నాల కు, చివరకు కర్నూలు నుండి హైదరాబాద్ కు వలస వచ్చిన ఆంధ్రులకు రాజధాని వదలటం కొత్త కాదు. వీరోచిత ఘన చరిత్ర గల తెలుగు వారికిఎన్నో ఆటుపోట్లు. మరల ఇప్పుడు
రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన రాష్ట్రం లో కుడా జ్ఞాతుల రాజకీయ పోరులో,రాబందుల చేతులలో దగాపడి ఈ నాడు హైదరాబాద్ ను వదలి వెళ్ళవలిసిన అగత్యం ఏర్పడటం శోచనీయం.
ఆత్మ గౌరవం ఆంధ్రుల నైజం. పౌర్షం మన రక్తం లోనే ఉంది . పొట్ట కూటికి పరాయి పంచన పడివుండే తత్వం మనది కాదు. ఓటమికి కుంగిపొయె జాతి కాదు. కష్టపడటం మన లక్షణం.
బ్రతకటానికి బరోసా ఇస్తామన్న ఈ రాజకీయ నీచులను నమ్మి మరల మోసపోవద్దు.
—స్వార్ద రాజకీయాలకు, కుటిల నీతికి తెలుగు నెల రెండు ముక్కలై పోయింది. తెలుగు జాతి చితికి పోయింది.

No comments:
Post a Comment