Menu bar





Friday, November 8, 2013

ఎన్నికలు వరకు ఆపితే రాష్ట్ర విభజన నిలిచిపోతుందా?

                       

                   రాష్ట్రవిభజనను వచ్చే సాధారణ ఎన్నికల వరకు వాయిదా వేయించగలిగితే, ఇక విభజన ప్రక్రియ ఆగిపోతుందని సమైక్యవాదుల ధృడంగా నమ్ముతున్నారు. అందుకు బలమయిన కారణాలు లేకపోలేదు. 

                    ఎందుకంటే ఈసారి యుపీయే, ఎన్డీయే రెండు కూటమిల మధ్య చాలా గట్టి పోటీ ఉంటుంది, గనుక వీటిలో ఏ ఒక్కటి కూడా పూర్తి మెజార్టీ సాధించి తమంతట తాముగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. అంతే గాక నితీష్ కుమార్, ములాయం సింగ్ వంటి వారు మూడో ఫ్రంట్ ఏర్పాటు గురించి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకవేళ అదికూడా అవతరిస్తే అప్పుడు ఈ మూడు కూటమిల మధ్య ఓట్లు చీలిపోవచ్చును. థర్డ్ ఫ్రంట్ అవతరించక పోయినప్పటికీ, యుపీయే, ఎన్డీయే కూటమిల మధ్య ఓట్లు చీలడం ఖాయం గనుక ఎవరికీ పూర్తి ఆధిఖ్యత రాకపోవచ్చును. 


                    అప్పుడు రెండు కూటములకి దేశంలో ప్రతీ ఒక్క యంపీ మద్దతు కీలకంగానే మారుతుంది. అటువంటప్పుడు ఏకంగా 25మంది సీమాంధ్ర యంపీల మద్దతు చాలా కీలకంగా మారబోతోంది. అయితే వారిలో వివిద పార్టీలకు చెందిన వారుంటారు గనుక రెండు కూటములకి వారి మద్దతు పొందే అవకాశం సరి సమానంగా ఉంటుంది. అంటే కేంద్రంలో ఒకవేళ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినా, రాష్ట్రం సమైక్యంగా ఉంచదానికి అంగీకరిస్తే వారిలో కనీసం 15-20 మంది మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కానీ అందుకు ప్రతిగా ఎన్డీయేకి తెలంగాణాలో తెరాస మద్దతు లభ్యం అవదు. అయితే ఈ సారి తెరాస నుండి కేవలం 5-8 మంది యంపీలుగా గెలిచే అవకాశమున్నట్లు సర్వేలు చెపుతున్నాయి గనుక, ఎన్డీయే కూటమి 15-20 మంది యంపీలున్న సీమాంధ్ర వైపే మొగ్గు చూపవచ్చును. 

                  ఒకవేళ యూపీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ, కేంద్రంలో ఐదేళ్ళపాటు అధికారంలో కొనసాగాలంటే సీమాంధ్ర యంపీలపై ఆధారపడక తప్పదు. బహుశః అందువలననే రాష్ట్ర విభజనను ఎన్నికలు వరకు నిలువరించగలిగితే, విభజన ప్రక్రియ ఆగిపోతుందని సమైక్యవాదులు దృడంగా భావిస్తున్నారు.

                        అయితే ఈ రెండు కూటములలో ఏదో ఒకటి అధికారంలోకి రావడం ఖాయం గనుక, అవి కేంద్రంలో మళ్ళీ కుదురుకొనే వరకు రాష్ట్ర విభజనలో కొంత జాప్యం ఉండవచ్చు తప్ప పూర్తిగా నిలిచిపోయే అవకాశం లేదు.

తేది 08-11-2013 నాటి పత్రికా కధనాలు



తేది 08-11-2013 నాటి పత్రికా కధనాలు










Thursday, November 7, 2013

అప్రమత్తమైన నేతలు: సీమాంధ్రకు 'భారీ' వరాలు

              కాంగ్రెసు పార్టీ, కేంద్రం విభజనపై వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో సీమాంధ్రలోని ఆగ్రహజ్వాలలు చల్లార్చేందుకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది! దీనికి సంబంధించి ఆయా మంత్రిత్వ శాఖలు కీలక ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నాయంట. రాష్ట్రానికే చెందిన పళ్లం రాజు మంత్రిగా ఉన్న మానవ వనరుల అభివృద్ధి శాఖ సీమాంధ్రలో ఉన్నతస్థాయి జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చింది. పెట్రోలియం శాఖ, జలవనరుల మంత్రిత్వ శాఖలు కూడా విభజనపై కేంద్రానికి నివేదికలు అందించాయి. విభజనపై అభిప్రాయాలు, సూచనలు పంపేందుకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసింది. అయినప్పటికీ ఎవరికి వారుగా, వేర్వేరుగా నివేదికలను రూపొందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం అనూహ్యంగా మళ్లీ రాయల తెలంగాణ, హైదరాబాద్ యూటి డిమాండ్‌లు తెరపైకి వచ్చాయి. అధిష్టానం ముందు సమైక్య గళం వినిపిస్తున్న సీమాంధ్ర నేతలు విభజన తథ్యమైన నేపథ్యంలో మరోవైపు భారీ ప్యాకేజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు 'భారీ' నివేదిక ఇచ్చారు. కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు అంగీకరిస్తే రాయల తెలంగాణనూ పరిశీలించవచ్చునని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంద్రుల పాత్ర, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కూడా కోరినట్లుగా తెలుస్తోంది.
              అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా రాయల టి ప్రస్తావన తెచ్చారు. మజ్లిస్ పార్టీ కేంద్ర హోంశాఖకు పంపిన నివేదికలో రాయల తెలంగాణతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపింది. హైదరాబాద్‌ను యూటిగా ప్రకటించవద్దని తేల్చి చెప్పింది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణ, సీమాంధ్ర నేతల అభిప్రాయాలతో వేర్వేరు నివేదికలు పంపించారు. సీమాంధ్రకు ఐఐటి, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలను మానవ వనరుల శాఖ ప్రతిపాదించింది. పెట్రోలియం, జల వనరులు తదితర శాఖలూ తమ తమ ప్రతిపాదనలను అందించాట. కేంద్ర మంత్రుల బృందానికి సమర్పిస్తున్న నివేదికల్లో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు పలు ప్రతిపాదనలు చేస్తున్నాయి. సీమాంధ్ర ప్యాకేజీలో భాగంగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. విభజన సందర్భంగా సీమాంధ్ర ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చి, వెల్లువెత్తిన ప్రజాందోళనను తగ్గించాలని చూస్తోంది. ఈ నెల ఏడో తేదీన జివోఎం మలి సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో, ఇప్పటికే కేంద్ర మానవ వనరులు, జల వనరులు, పెట్రోలియం, సహజవాయువు శాఖలు తమ తమ నివేదికలను సమర్పించాయి. మిగతా శాఖలు కూడా బుధ, గురువారాల్లో నివేదికల్ని సమర్పించే అవకాశముంది.
       విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా హైదరాబాద్‌కే పరిమితమయ్యాయని, రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా పలువురు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక విద్య, పరిశోధనా సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్న నేపథ్యంలో తాము తీవ్రంగా నష్టపోతామని సీమాంధ్ర విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇవే అంశాలను పేర్కొంటూ ప్రజలు, వివిధ వర్గాలు, సంస్థలు, రాజకీయ పార్టీలు జివోఎంకు నివేదికలు, ప్రతిపాదనలు, సూచనలను అందించాయి. జివోఎం వాటిని వివిధ మంత్రిత్వ శాఖలకు పంపించింది. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న వివిధ మంత్రిత్వ శాఖలు ఈ నివేదికలను తయారు చేశాయి. ఈ నేపథ్యంలోనే, సీమాంధ్రలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, ఐఐఎంలతోపాటు మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమేనని మానవ వనరుల శాఖ తన నివేదికలో పేర్కొంది. విభజన జరిగితే సీమాంధ్ర విద్యార్థులు పెద్దఎత్తున నష్టపోతారంటూ వస్తున్న భయాలు, అనుమానాల నేపథ్యంలో వాటిని నివృత్తి చేయడమే కాకుండా సీమాంధ్రకు వీలైనంత ఎక్కువ ప్రయోజనం చేకూర్చేందుకు, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతిష్ఠాత్మక పరిశోధన, విద్యా సంస్థలకు దీటుగా సీమాంధ్రలో కూడా ఆయా సంస్థల్ని ఏర్పాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మానవ వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంస్థల ఏర్పాటుకు దాదాపు రూ.7 వేల కోట్లు ఖర్చవుతాయని ఆ శాఖ అంచనా వేసింది.




సుప్రీంలో సమైక్యవాదుల అలజడి!

             రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపడానికి అనేక మంది చట్టం, న్యాయాల సాయాన్ని తీసుకొంటున్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మాట చెల్లుబాటు కాకుండా చూడటానికి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమలు కాకుండా చూడటానికి అనేక మంది సుప్రీం కోర్టు ఆశ్రయిస్తున్నారు. ఇప్పటి వరకూ సుప్రీంలో ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా లెక్కకు మించి పిటిషన్లు పడినట్టు తెలుస్తోంది. రాజకీయ నాయకులు, ముఖ్య రాజ్యాంగ నిపుణులు వేసే పిటిషన్లకు మాత్రమే పత్రికల్లో కవరేజీ వస్తోంది. అయితే సామాన్యులు, ఇతరులు వేసే పిటిషన్లు కూడా చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ఈ పిటిషనర్ల ఆశ అంతా.. రాజ్యాంగం మీదే! ఆంధ్ర్రపదేశ్ ఏర్పాటు సమయంలో రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ ను అడ్డుపెట్టుకొని విభజన నను ఆపాలని వీరంతా భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర్ర ప్రదశ్ విభజనకు బిల్లు రూపొందిస్తే.. దాన్ని పార్లమెంటు వరకూ తీసుకు వస్తే రాజ్యాంగం ప్రకారం ఆ బిల్లు చెల్లదని కో ర్టు ద్వారా చెప్పించాలని పిటిషనర్లు తాపత్రయపడుతున్నారు. బిల్లు పాస్ అవ్వాలంటే రాజ్యాంగ సవరణ అవసరం అని స్పష్టం చేయించాలని భావిస్తున్నారు. అలా రాష్ట్ర విభజన ప్రక్రియ వచ్చే శీతాకాల సమావేశాల సమయంలో ఆగిపోతే.. 2014 తర్వాత ముందడుగు పడే అవకాశాలే లేవని భావిస్తున్నారు. అయితే ఇదంతా ఆశాభావ దక్పథం మాత్రమే. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఏదైనా మాయ చేసి బిల్లును ముందుకు తీసుకెళ్లి.. విభజన ప్రక్రియను పూర్తి చేస్తే ఆ తర్వాత ఎవరు చేయగలిగింది ఏమీ ఉండదు. ప్రస్తుతానికి అయితే సుప్రీం స్థాయిలో సమైక్యవాదుల హడావుడి ఎక్కువగా ఉంది. మరి వారు ఈ విషయంలో గెలుస్తారో, గల్లంతవుతారో వేచి చూడాలి!

తేది.07/11/2013 నాటి పత్రికా కధనాలు











Wednesday, November 6, 2013

జీవోయం వద్దు - ఆంద్ర ప్రదేశ్ ఎస్సార్సీ వెయ్యండి

       రాష్ట్రాన్ని ముక్కలు చేసెయ్యడానికి ఉరుకులూ పరుగులూ పెడుతున్న కేంద్ర ప్రభుత్వం - అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు; ఇంకా మాట్లాడితే - అసెంబ్లీని సస్పెండ్ చేసి అయినా, బిల్లు తెచ్చేస్తాం అన్న సర్కారు వారు - హఠాత్తుగా "అఖిలపక్షం" పాట ఎందుకెత్తుకున్నారు? మేము చెప్పిందే ప్రజాస్వామ్యం అన్న వాళ్ళకి - మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు ఎందుకు గుర్తుకు వచ్చాయి? వచ్చెనే పో! అన్ని పార్టీలతో మాట్లాడి, అందరూ ప్రేమ లేఖలు ఇచ్చిన తర్వాతే, బిల్లుకు సై అన్నామని డోలుకొట్టి మరీ చెప్పిన వాళ్ళు ... మళ్ళీ విపక్షాలతో మంత్రాంగానికి తలుపులెందుకు తెరిచారు?

దారి తప్పిన వైనం:

అఖిల పక్షాల నిర్వహణ ప్రకటనలో ఒక గందర గోళం ఉంది. అఖిల పక్ష సమావేశం నిజానికి - CWC నిర్ణయానికి ముందే నిర్వహించాలి. cwc నిర్ణయం తర్వాత > కేబినేట్ నోట్ పెట్టిన తర్వాత, జీవోయం నియామకం తర్వాతః - తెలంగాణా ఇచ్చేస్తున్నామని కేంద్రం ప్రకటించిన తర్వాత - తీరికగా - అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చెయ్యడ మేమిటి? దానికి ముందే - జీవోయం రిఫరెన్సులపై రాత పూర్వకంగా అభిప్రాయం చెప్పాలని ఆదేశాలేమిటి? ప్రజల అభిప్రాయంతో కాక, అధినేత్రి నిర్ణయంతో తెలంగాణా ఇచ్చేస్తున్నామని ప్రకటించారు కదా!.ఇంతవరకు బిల్లుకు ఓ రూపం ఇవ్వ లేదు - రాష్ట్రపతికి పంప లేదు! అసెంబ్లీకి రాలేదు - పార్లమెంటుకు వెళ్ల లేదు - రాష్ట్రం ముక్కలు చెయ్యడానికి మాత్రం ఏర్పాట్లు మొదలెట్టేసారు! ఈ తతంగం బాగోలేదని రాష్ట్రపతి చివాట్లు వెయ్యడంతోనే ఈ అఖిల పక్ష నాటకానికి తెర లేచినట్లుంది. అయితే, ఇది మరింత గందరగోళానికే దారి తీస్తుంది!

ఏం చేసి ఉండాలి?

ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం "రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు" పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. అందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాల సేకరణ చేసి - దానికి అనుగుణంగా - బిల్లు ఏర్పరచాలి. అదే సరైన ప్రాతిపదిక అవుతుంది. ఇక్కడ కేంద్రం ప్రజలను బైపాస్ చేసేసింది. పార్టీలు గతంలో ఇచ్చిన ప్రేమ లేఖలనే తెలంగాణా ఏర్పాటుకు ప్రాతిపదిక అంది. పార్టీల అభిప్రాయాలు సేకరించి - ఆ ప్రకారం బిల్లు పెట్టాలని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? ఒక పక్క -రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ ఐన అసెంబ్లీ అభిప్రాయమే అవసరమే లేదని, దానిని లెక్కజేయవలసిన అవసరమే లేదని గీరగా మాట్లాడుతున్నవాళ్ళు - ఇప్పుడు అఖిల పక్షం కోసం ఎందుకు హడావిడీ చేస్తున్నారు? అసెంబ్లీకన్నా అఖిల పక్షం ఎట్లా ఎక్కువ?

ఆంటోనీ కమిటీ వేసినప్పుడు - అది కాంగ్రెస్ పార్టీ కమిటీ అని విమర్శించిన ప్రతిపక్షాలు, ఇప్పుడు ప్రభుత్వ కమిటీ (జీవోయం) వేస్తే - దాని ఎదుట తమ అభిప్రాయాలు ఎందుకు చెప్పరని - కేంద్ర కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది? జీవోయం ప్రతిపాదనలను అంగీకరించినా, తిరస్కరించినా - రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లే అవుతుంది. అధినేత్రి నిర్ణయానికి అఖిల పక్ష ముద్ర వేయించుకోడానికే ఈ తతంగమంతా! జీవోయం "విభజన తర్వాత" ఏమి చెయ్యాలో చెప్పమనే అడుగుతోంది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ప్రతిపక్షాలు, చివరకు కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నేతలు కూడా ఈ అఖిలపక్ష సమావేశాల ఏర్పాటును తప్పుబట్టాయి.దీనితో మొత్తం వ్యవహారం గందరగోళంలో పడిపోయింది.

జీవోయం ను బహిష్కరించక తప్పదు!

సమైక్య వాదులు కానీ, సమన్యాయ వాదులు కానీ కోరుతోంది - రాష్ట్ర విభజన అవసరమా కాదా అన్నఅంశం పై ప్రజాభిప్రాయం కోరాలని! అందుకోసమే - వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ విద్యార్థీ సంఘాలు, రైతులను ఈ నిర్ణయంలో భాగాస్తులను చెయ్యాలని కోరుతున్నారు. "విభజనకు తీర్పు ఇచ్చేశాం. మీ బాధలు, వాదనలు మాత్రమే చెప్పుకోండి" అంటోంది కేంద్రం! ఇదొక వెటకారం! కాదంటే, కుటిల వ్యవహారం! "తెలంగాణా ఇచ్చేసాం; సంతకాలు పెట్టి వెళ్ళండి" అని అనడమే ఇది! కాంగ్రెస్ విసిరిన ఈ అఖిల పక్ష సవాలును అవకాశంగా తీసుకొని - విపక్షాలు జీవోయం రద్దు కోరాలి! లేదా బహిష్కరించాలి!

జీవోయం వద్దు - ఆంద్ర ప్రదేశ్ ఎస్సార్సీ వెయ్యండి:

రాష్ట్రాల విభజనకు, రీడిజైన్ చేయడానికి నేపథ్యంగా అందుకో బలమైన ప్రాతిపదిక ఉండాలి. అది జనాభిప్రాయానికి దగ్గరగా ఉండాలి. వివిధ సెక్షన్ల ప్రజలను, ప్రజా సంఘాలను ఇందులో భాగస్తులను చెయ్యాలి. విభజన వాదుల ఒత్తిడి రాజకీయం, విద్వేష ప్రచారం, జనాన్ని రెచ్చగొట్టి సృష్టించిన హింసాత్మక వాతావరణం - ఇవే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు ప్రాతిపదిక అయితే, భవిష్యత్తులో అట్లాంటి విప్లవాలు దేశమంతా తలెత్తడం ఖాయం!

పునర్వ్యవస్థీకరణకు - రెండవ ఎస్సార్సీనే ఉత్తమ మార్గం అని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఒకవేళ దేశ వ్యాపితంగా అట్లాంటి వ్యవస్థ చెయ్య లేకపోతే, ఆంద్ర ప్రదేశ్ లో 'అత్యవసర పరిస్థితి' ఉందని అనుకుంటే, అందుకోసం ఏర్పాటు చేసే వ్యవస్థ ' ఎస్సార్సీ కన్నా తక్కువ స్థాయిది' కాకూడదు! అది అధినేత్రి ఇష్టారాజ్యం అసలే కాకూడదు! ఇప్పటికైనా మించి పోయిందేముంది? అఖిల పక్షం జిమ్మిక్కులు మాని - జీవోయం ఎత్తేసి - Special Committee for Re-organization of AP (SCRAP) వెయ్యాలి! అది ప్రజాభిప్రాయ వేదిక కావాలి! దీనికి విరుద్దంగా ఏమి చేసినా అది అధికార పార్టీ దురహంకార పూరిత ఏకపక్ష నిర్వాకమే అవుతుంది.

తేది 06-11-2013 నాటి వార్తలు






తేది 06-11-2013 నాటి వార్తలు